Ajith Kumar: సికింద్రాబాద్ టూ కోలీవుడ్.. హీరో కాకముందు అజిత్ ఏం చేసేవాడో తెలుసా..

ప్రస్తుతం దేశం మొత్తం హీరో అజిత్ గురించి మాట్లాడుకుంటుంది. ఇన్నాళ్లు వెండితెరపై హీరోగా తనదైన నటనతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు దుబాయ్ 24 గంటల రేసులో మూడో స్థానంలో నిలిచాడు. రేసింగ్‌లోనే కాకుండా పైలటింగ్‌, వంట చేయడం, నటనలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్‌పై ఆసక్తి పెంచుకున్న అజిత్‌ రేసింగ్‌లో ఎన్నో విజయాలు సాధించాడు.

Ajith Kumar: సికింద్రాబాద్ టూ కోలీవుడ్.. హీరో కాకముందు అజిత్ ఏం చేసేవాడో తెలుసా..
Ajith
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2025 | 11:43 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్.. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు రెడీ అవుతాడు. తాజాగా దుబాయ్‌లో నటుడు అజిత్ సరికొత్త ఘనత సాధించిన సంగతి తెలిసిందే. దుబాయ్ 24 గంటల రేసింగ్ అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్‌కు సొంత రేసింగ్ కంపెనీ ఉంది. బైక్ పై అనేక దేశాలను చుట్టేశాడు. హీరోగా సినీరంగంలోకి రాకముందే ఆటోమొబైల్ అంటే విపరీతమైన ప్రేమ ఉండేది. చదువు మధ్యలోనే ఆపేసిన ఈ సికింద్రాబాద్ కుర్రాడు ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఓ బైక్ గ్యారేజీలో పనిచేశాడు. ఆ తర్వాత నటన వైపు ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఇప్పటికీ తనకు ఇష్టమైన రేసింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. సినిమాలు, ఫ్యామిలీ కారణంగా కొన్నాళ్లపాటు రేసింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న అజిత్.. ఇప్పుడు మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేశాడు.

దుబాయ్ 24 గంటల రేస్‌లో మూడో స్థానం సాధించాడు. 1992లో రేసింగ్‌లో అజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు అతనికి చాలా గాయాలయ్యాయి. ఇటీవల రేసింగ్‌లో ఉండగా ప్రమాదానికి గురయ్యాడు. కానీ ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డాడు. అజిత్ బైక్, కార్ మాత్రమే కాదు.. విమానాలు సైతం నడపగలడు. ఫైటర్ జెట్ లైసెన్స్ ఉన్న ఏకైక హీరో అజిత్. చెన్నై ఫ్లయింగ్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటాడు అజిత్. అంతేకాదు.. ఈ హీరో మంచి చెఫ్ కూడా. అలాగే మంచి షూటర్. అతడికి షూటింగ్‌లో లైసెన్స్ కూడా ఉంది. షూటింగ్ కోసం జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు. తమిళనాడు షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు సాధించాడు.

అలాగే షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే తన ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఈ హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటించిన విదాముయార్చి సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..