Keerthy Suresh: కొత్త జంట కీర్తి సురేశ్, ఆంటోనీల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ..?
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కీర్తి.. ఇటీవలే తన స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. ?
దక్షిణాది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంతి తెలిసిందే. తన స్నేహితుడు ఆంటోనీని గతేడాది డిసెంబర్ 12న పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం గోవాలో ఘనంగా జరగ్గా కోలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్, ఆంటోనీ ఏజ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కీర్తి కేరళకు చెందినప్పటికీ ఆమె మలయాళం కంటే తమిళం, తెలుగు భాషా చిత్రాలలో ఎక్కువగా నటించింది. కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆమె తండ్రి సురేష్ కుమార్ సినీ నిర్మాత. తల్లి మేనక ఒకప్పుడు హీరోయిన్.
బాలనటిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్ ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్స్ సరసన నటించిన కీర్తి.. ఇదు ఎన్న మాయం సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తెలుగులో మహానటి సినిమాలోని సావిత్రి పాత్రకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇటీవల సుమన్ కుమార్ తెరకెక్కించిన రఘుతాత సినిమాలో నటించి మరో హిట్ అందుకుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్, తన భర్త ఆంటోనీ దాదాపు 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ 12వ తరగతిలోనే స్టార్ట్ అయ్యిందని చెప్పుకొచ్చింది కీర్తి. గతేడాది డిసెంబర్ 12న గోవాలో తన ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకుంది. ఆ వివాహ వేడుకలో నటి కీర్తి సురేష్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. తాను స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఆంటోనీతో ప్రేమలో పడ్డానని, వారిద్దరూ చాలా దూరం రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిపింది. కీర్తి సురేష్, ఆంథోనీ తటిల్ మధ్య 7 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.