AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan- Mahesh: పవన్‌కు ప్రియురాలిగా.. మహేష్‌కు తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టీచర్‌గా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు. టాక్ తో అసలు సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి ఈ హీరోల సినిమాలు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంలో ఎవరికి వారే సాటి.

Pawan- Mahesh: పవన్‌కు ప్రియురాలిగా.. మహేష్‌కు తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టీచర్‌గా..
Pawan Kalyan, Mahesh Babu
Basha Shek
|

Updated on: May 09, 2025 | 11:55 AM

Share

పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. ప్రస్తుతం ఇద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోలుగ కొనసాగుతున్నారు. వీరి సినిమాలకు టాక్ తో సంబంధం లేదు. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతుంటాయి. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారీ టాలీవుడ్ స్టార్స్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలు తీయట్లేదు. ఒక వేళ మళ్లీ సినిమాలపై పూర్తి దృష్టి సారిస్తే మాత్రం ఇప్పుడున్న పాన్ ఇండియా రికార్డులు సైతం బద్దలవుతాయి. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం పైనే పవన్ దృష్టంతా ఉంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉంటున్నాడు. పాన్ వరల్డ్ వైడ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మూవీ పైనే ఉంది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా నటించిన ఓ హీరోయిన్ కాలక్రమేణా తర్వాతి కాలంలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ నటించిన రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ లోనూ నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ కు తల్లిగానే ఆమె నటించింది.అదే ఓ సినిమాలో నందమూరి బాలకృష్ణకు సోదరిగా నటించింది. ఈ హీరోయిన్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు కానీ.. టీచర్ గా పిల్లలకు పాఠాలు చెబుతూ బిజి బిజీగా ఉంటోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? తను మరెవరో కాదు దేవయాని.. అదేనండి.. పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా హీరోయిన్ దేవయాని.

సుస్వాగతంలో పవన్ కు లవర్ గా నటించి మెప్పించింది దేవయాని. అయితే దీని తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదీ అందాల తార. తిరిగి సెకెండ్ ఇన్నింగ్స్ లో చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు చెల్లెలిగా చేసింది. ఆ తర్వాత నాని సినిమాలో మహేష్ బాబుకు అమ్మగా నటించింది. ఇందులో ఇందిరా దేవిగా దేవయాని అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

దేవయాని లేటెస్ట్ ఫొటోస్..

ఇక జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ భార్యగా, ఎన్టీఆర్ పెద్దమ్మగా నటించింది దేవయాని. అదే ఎన్టీఆర్‌కు అరవింద సమేత సినిమాలో తల్లిగా నటించిందీ అందాల తార. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..