Actress: 9 సంవత్సరాలలో కేవలం ఒక్క బ్లాక్ బస్టర్.. అయినా క్యూ కట్టిన ఆఫర్స్..
సినీరంగంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో దూసుకుపోతున్న కొందరు హీరోయిన్లు ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ సైతం అందుకోలేకపోయారు. కానీ వారికి అవకాశాలు మాత్రం క్యూ కట్టాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. దాదాపు 9 సంవత్సరాలుగా సినిమా రంగుల ప్రపంచంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు జోడిగా నటించినప్పటికీ ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. కేవలం ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ దిశా పటాని. తెలుగులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. 2016లో ఎంఎస్ ధోని బయోపిక్ ‘ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గత తొమ్మిదేళ్లల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ కేవలం ఒక్క హిట్టు అందుకుంది. 2018 సంవత్సరంలో దిశా టైగర్ ష్రాఫ్ తో కలిసి ‘బాఘి 2’ లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు చాలా ప్రశంసలు లభించాయి.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ గ్లామర్ హీటెక్కిస్తుంది. అంతేకాదు.. హిట్టుకొట్టకపోయినా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం క్యూ కడుతున్నాయి. చివరగా ప్రభాస్ నటించి కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..








