Animal movie: ‘యానిమల్’ జమాల్ కుడు పాటలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?.. పూర్తి బ్యాగ్రౌండ్ ఇదే..

డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.800 కోట్లు రాబట్టింది. ఇందులోని సన్నివేశాలు.. డైలాగ్స్.. నటీనటుల యాక్టింగ్.. సాంగ్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అంతేకాదు.. ఇప్పుడు ఈ మూవీ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్. ఈ సినిమాలోని సాంగ్స్, సీన్స్ మీమ్స్ రూపంలో వైరలవుతున్నాయి. అలాగే సినిమాలోని సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజాగా 'జమాల్ కుడు' అనే పర్షియన్ సాంగ్ టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

Animal movie: 'యానిమల్' జమాల్ కుడు పాటలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?.. పూర్తి బ్యాగ్రౌండ్ ఇదే..
Tannaz Davoodi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2023 | 6:35 PM

డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‏తో దూసుకుపోతుంది. డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.800 కోట్లు రాబట్టింది. ఇందులోని సన్నివేశాలు.. డైలాగ్స్.. నటీనటుల యాక్టింగ్.. సాంగ్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అంతేకాదు.. ఇప్పుడు ఈ మూవీ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్. ఈ సినిమాలోని సాంగ్స్, సీన్స్ మీమ్స్ రూపంలో వైరలవుతున్నాయి. అలాగే సినిమాలోని సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజాగా ‘జమాల్ కుడు’ అనే పర్షియన్ సాంగ్ టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ సాంగ్ బ్యాగ్రౌండ్ ప్లే అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలో మాత్రమే వినిపించిన ఈ పాటను..ఇప్పుడు అధికారికంగా రివీల్ చేశారు. దీంతో ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది.

అయితే జమాల్ కుడు పాటలో కనిపించిన అమ్మాయి కూడా ఫేమస్ అయ్యింది. ఆమె కోసం గూగుల్ లో సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తను ఇరానియన్ మోడల్. డాన్సర్ తన్నాజ్ దావూది. జమాల్ కుడు అనేది 1950ల చివరినాటి ఇరానియన్ పాట. ఈ సినిమాను యానిమల్ సినిమా రీక్రియేట్ చేశారు. బాబీ డియోల్ మూడవ వివాహం చేసుకుంటున్న సమయంలో ఈ పాట ప్లే అవుతుంది. బాబీ తలపై గ్లాస్ తో డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తుండగా.. జమాల్ కుడు పాట పాడుతున్న అమ్మాయిల గుంపు వద్దకు వెళ్లడంతో సీక్వెన్స్ ప్రారంభమవుతుంది. ఈ పాటతోనే తన్నాజ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

తన్నాజ్ దావూది భారతీయ సినిమాల్లో నటిస్తున్న ఇరాన్ మోడల్. ఆమె డాన్సర్ కూడా. యానిమల్ కంటే ముందు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంది. వరుణ్ ధావన్, నోరా ఫతేహి, జాన్ అబ్రహం, సన్నీలియోన్ లతో కలిసి పనిచేసింది. అయితే యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అందుకుంది. యానిలమ్ సినిమాలోన జమాల్ కుడు పాటలో తన ఎక్స్‏ప్రెషన్స్ తో హైలెట్ అయ్యింది తన్నాజ్. ఈ సినిమాకు ముందు ఆమెకు ఇన్ స్టాలో దాదాపు 10 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కానీ యానిమల్ విడుదల అనంతరం రెండు వారాల్లోనే దాదాపు 2.6 లక్షల ఫాలోవర్స్ పెరిగారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.