Tollywood: అమాయకపు చూపుల చిన్నారి అడియన్స్ మనసు దోచిన హీరోయిన్.. చారడేసి కళ్ల చందమామ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది. తన తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టింది ఈ చిన్నది. అయితే ఫస్ట్ మూవీతో నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత కోలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడ బిజీగా ఉండిపోయింది.
పైన ఫోటోలో కనిపిస్తున్న అమాయకపు చూపుల చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దొచుకుంది. ఆమె తల్లి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది. తన తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టింది ఈ చిన్నది. అయితే ఫస్ట్ మూవీతో నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత కోలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడ బిజీగా ఉండిపోయింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురుకావడంతో బిజినెస్ పై దృష్టి పెట్టింది. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. వ్యాపారరంగంలో దూసుకుపోతుంది. ఇటీవలే తన స్నేహితుడితో ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ కార్తిక నాయర్.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక నాయర్. అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా పరిచయమైన జోష్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. 2015 తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై దూరమైపోయింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీకి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కొన్నాళ్లుగా వ్యాపార రంగంలో రాణిస్తుంది.
View this post on Instagram
అయితే ఈనెల 19న తమిళనాడులో తిరువనంతపురంలో తన ప్రియుడిని వివాహం చేసుకుంది కార్తీక. వీరిద్దరి వివాహనికి అలనాటి హీరోహీరోయిన్స్ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి సైతం హజరయ్యారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.