Siddharth: సరైన బ్రేక్ కోసం చూస్తోన్న సిద్దార్థ్.. ఈ హీరో ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
తెలుగు సినీరంగంలో ఒకప్పుడు లవర్ బాయ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అడియన్స్ హృదయాలను దొచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరో సిద్ధార్థ్. కానీ కొన్నాళ్లుగా ఈ హీరో ఖాతాలో సరైన హిట్టు పడడం లేదు. ఇప్పుడిప్పుడే తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈక్రమంలో తాజాగా సిద్ధార్థ్ లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

సిద్ధార్థ్.. అసలు పేరు సిద్ధార్థ్ సూర్య నారాయణ్. ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరో. ప్రేమకథ చిత్రాలతో భారీ విజయాలను అందుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తమిళ సినిమా నుంచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన సిద్ధార్థ్.. తెలుగు, హిందీ భాషలలోనూ నటించారు. అయితే ఒకప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ హీరోకు వరుసగా డిజాస్టర్స్ రావడంతో ఆఫర్స్ సైతం తగ్గిపోయాయి. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. అలాగే పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవలే హీరోయిన్ అదితి రావు హైదరీతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆర్. మాధవన్, నయనతార సైతం ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిచారు. గత రెండు దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంటున్నారు సిద్ధార్థ్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సిద్ధార్థ్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. నివేదికల ప్రకారం.. సిద్ధార్థ్ నికర విలువ దాదాపు 70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా . అయితే సిద్ధార్థ్, అదితి రావు హైదరిల మొత్తం నికర విలువ 130 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అతని సినిమా ఫీజులు, నిర్మాతగా, సింథాల్ వంటి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి కూడా సంపాదిస్తున్నాడు. సిద్ధార్థ్ సినిమా ప్రయాణం మణిరత్నం దర్శకత్వంలో 2002లో వచ్చిన కన్నతిల్ ముత్తమిట్టల్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభమైంది. శంకర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘బాయ్స్’ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా వంటి చిత్రాలతో తెలుగులో హిట్స్ అందుకున్నాడు. ఆమిర్ ఖాన్‌తో కలిసి హిందీ చిత్రం రంగ్ దే బసంతిలో సహాయక పాత్రలో కనిపించి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ 2007 వరకు మేఘనా నారాయణ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే అతడు విడిపోయారు. 2021లో మహా సముద్రం సినిమాలో తనతో కలిసి నటించిన అదితి రావు హైదరీని ప్రేమించి గతేడాది పెళ్లి చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..