Kinnerasani Trailer : ”కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా”.. కిన్నెరసాని ట్రైలర్..
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. విజేత సీమతో హీరోగా పరిచయం అయ్యాడు కళ్యాణ్ దేవ్
Kinnerasani Trailer : మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. విజేత సీమతో హీరోగా పరిచయం అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించాక పోయిన కళ్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాతర్వాత ఇప్పటివరకు మారే సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సూపర్ మచ్చి , కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు. అశ్వద్ధామ మూవీ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు అతి సర్వత్ర వర్జయత్ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నీ ముందున్న సముద్రపు అలలను చూడు కోపగించుకొని వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి.. కానీ సముద్రం వాటిని వదలదు.. వదులుకోదు.. నేను కూడా అంతే అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో సినిమా ట్రైలర్ మొదలైంది.ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్ మిస్టరీ ప్రధానంగా ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. ”కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా” అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ వింటుంటే. ఈ సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్ధమవుతుంది. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెప్పాన్స్ వచ్చింది.ఈ మూవీకి మహతి సాగర్ సంగీతం అందించారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :