Amala Akkineni: చాలా రోజుల తర్వాత వెండితెరపై అమల.. నాగార్జున ఏమన్నారంటే..
'శివ', 'నిర్ణయం', 'ప్రేమయుద్ధం' తదితర సినిమాల్లో జంటగా కనిపించి అలరించారు అక్కినేని నాగార్జున, అమల. వెండితెరపై సూపర్‌హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఆతర్వాత ఇద్దరూ ఏడడుగులు
‘శివ’, ‘నిర్ణయం’, ‘ప్రేమయుద్ధం’ తదితర సినిమాల్లో జంటగా కనిపించి అలరించారు అక్కినేని నాగార్జున, అమల. వెండితెరపై సూపర్‌హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఆతర్వాత ఇద్దరూ ఏడడుగులు నడిచి నిజ జీవితంలోనూ ‘ది బెస్ట్ కపుల్’ అనిపించుకున్నారు. కాగా నాగ్‌ను పెళ్లాడాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అమల. ఇంటిపట్టునే ఉండిపోయి అఖిల్ బాధ్యతలతో పాటు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బిజీ అయ్యారు. 1993లో విడుదలైన రాజశేఖర్ ‘ఆగ్రహం’ చిత్రంలో ఆమె చివరిసారిగా పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించింది. కాగా 2012లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అమల.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో మళ్లీ తెరపై కనిపించారు. ఆతర్వాత మలయాళంలో ‘కేరాఫ్ సైరాభాను’, ‘మనం’ చిత్రంలో డ్యాన్స్ టీచర్ కొద్ది సేపు కనిపించారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం తెరపై కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును పూడుస్తూ మరోసారి పూర్తిస్థాయిలో తెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా పేరే ‘ఒకే ఒక జీవితం’.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమల కీలక పాత్రలో నటించింది. నిన్ననే (బుధవారం) ఈ సినిమా టీజర్ విడుదలైంది. దీనిని చూస్తుంటే తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత అమల తెరపై కనించడంపై నాగార్జున స్పందించారు. టీజర్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అదేవిధంగా సతీమణి అమలను ఉద్దేశిస్తూ ‘ ‘నిన్ను మళ్లీ తెరపై చూడడం సంతోషంగా ఉంది అమల. ‘ఒకే ఒక జీవితం సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు నాగ్. కాగా ఈ సినిమాలో శర్వా పక్కన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
It would be lovely to see you back on the screen again Amala❤️. All the best to the team!! https://t.co/nXq6rD5a48
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 29, 2021
Also Read:
Mahabubabad: పత్తి బస్తాలను ఓపెన్ చేయగానే షాక్.. ఇంతకీ అందులో ఏముందంటే..