Tollywood : సీజ్ చేసిన థియేటర్స్ రీఓపెన్… ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్..

ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.. టికెట్ ధరలను తగ్గించారంటూ సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తుంటే..

Tollywood : సీజ్ చేసిన థియేటర్స్ రీఓపెన్... ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2021 | 1:25 PM

Tollywood : ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.. టికెట్ ధరలను తగ్గించారంటూ సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండాలని అంటుంది. ఇక వ్యవహారం పై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే జీవో నెంబర్ 35 రూల్స్ ఫాలో అవ్వడం లేదు అంటూ.. పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి దాదాపు 83 థియేటర్లకు సీల్ వేశారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లు వర్కవుట్  కావడం లేదు అని థియేటర్ యాజమాన్యం, డిస్టిబ్యూటర్స్ చెప్తున్నారు. ఈ విషయం పై ఇటీవలే తమ గోడును మంత్రి పేర్ని నాని దగ్గర వినిపించారు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్.

తాజాగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ త‌ర‌పున కొన్ని విన్న‌పాలు చేసుకోవ‌డం జ‌రిగింది. అందులో మొద‌టగా థియేట‌ర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ముఖ్య‌మంత్రి గౌర‌వ‌నీయులు శ్రీ వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిగారికి, సినిమాటోగ్ర‌ఫి మంత్రి వర్యులు శ్రీ పేర్ని నాని గారికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ తరపున కృత‌జ్ఞ‌త‌లు తెళిప్పారు. మిగ‌తా విన్న‌పాల ప‌ట్ల కూడా సానుకూలంగా స్పందించి మ‌మ్మ‌ల్ని ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక టికెట్ల రేట్లపై GO 35 అమలులో ఉన్నా.. రేట్ల నిర్దారణ కోసం ఓ కమిటీనీ వేశామని, ఆ రిపోర్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని హామీ ఇచ్చిన పేర్ని నాని.. ఇటు సీల్ వేసిన థియేటర్లకూ ఊరటనిచ్చారు. ఫైన్లు కట్టి థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa The Rise: థియేటర్స్‌లో పుష్పరాజ్ హవా.. ‘దాక్కో దాక్కో మేక’.. ఫుల్ సాంగ్ వచ్చేసింది..

Minister Perni Nani: సీజ్ చేసిన థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చిన సర్కార్.. కండిషన్స్ అప్లై..

RamCharan: ఆ సినిమాలకు రామ్‌ చరణ్ భారీ రెమ్యునరేషన్‌ !.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ..