Mahabubabad: పత్తి బస్తాలను ఓపెన్‌ చేయగానే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

పాపం పంట దిగుబడి సరిగా రాలేదనో.. పెట్టుబడి ఎక్కువైందనో.. అప్పులు తీర్చుకోవాలనే తాపత్రయంతోనో.. ఓ అన్నదాత చేసిన పనికి అధికారులు అవాక్కయ్యారు

Mahabubabad: పత్తి బస్తాలను ఓపెన్‌ చేయగానే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2021 | 5:45 AM

పాపం పంట దిగుబడి సరిగా రాలేదనో.. పెట్టుబడి ఎక్కువైందనో.. అప్పులు తీర్చుకోవాలనే తాపత్రయంతోనో.. ఓ అన్నదాత చేసిన పనికి అధికారులు అవాక్కయ్యారు. 35 పత్తి బస్తాలతో ఓ రైతు మార్కెట్‌కు వచ్చాడు. మార్కెట్ రేటు, పత్తి నాణ్యతను బట్టి రేటు కూడా ఫిక్స్ చేశారు. కానీ బస్తాలు కాంటా వేసే దగ్గరే ఏదో తేడా కొట్టింది. బస్తాలు తూకం చేస్తుండగా.. ఎక్కువ బరువు తూగుతున్నాయి. అనుమానం వచ్చి బస్తాలను కత్తిరించి చూడగా.. అసలు విషయం బయటపడింది. అదేంటంటే.. ఆ పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం కలుపుకొని వచ్చాడా రైతు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కారేపల్లి మండలాలనికి చెందిన ఓ రైతు బుధవారం 35 పత్తి బస్తాలను కే సముద్రం మార్కెట్‌కు తీసుకొచ్చాడు. వీటిని ఓ ట్రేడర్‌ కంపెనీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. అనంతరం పత్తి నాణ్యతను చూసే క్రమంలో కాంటాపై తూకం వేశారు. అయితే ఎక్కువ బరువు తూగడంతో అనుమానమొచ్చిన గుమస్తా ఆ పత్తి బస్తాలను కట్‌ చేసి చూడగా పత్తి మధ్యలో బియ్యం ఉండడాన్ని గమనించారు. మిగిలిన బస్తాలను కోసి పరిశీలించగా ఒక్కో బస్తాలో 4 నుంచి 5 కిలోల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఇతర రైతులు, హమాలీలు, అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైతులు ఇలాంటి పనులు చేయకూడదని గిట్టుబాటు ధర కోసం ప్రయత్నించాలని అధికారులు సూచించారు.

Also Read:

TS Mandali Chairman: త్వరలో ఖాళీ అవుతున్న శాసన మండలి ప్రొటెం ఛైర్మన్.. తెలంగాణ పెద్దల సభకు పెబ్బ ఎవరు?

RamCharan: ఆ సినిమాలకు రామ్‌ చరణ్ భారీ రెమ్యునరేషన్‌ !.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ..

Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..