Mogulaiah Song: పచ్చదనం ప్రాముఖ్యతను పాట రూపంలో అద్భుతంగా ఆలపించిన మొగులయ్య.. మొక్కలు నాటి మంచి సందేశం..
Mogulaiah Song: పవన్ కళ్యాణ్ సినిమా తాజా చిత్రం 'భీమ్లా నాయక్' చిత్రంలో టైటిల్ సాంగ్ పాడిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య...

Mogulaiah Song: పవన్ కళ్యాణ్ సినిమా తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ చిత్రంలో టైటిల్ సాంగ్ పాడిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తన అద్భుత గాత్రంతో ఆకట్టుకున్న మొగులయ్యకు పవన్ కూడా ఫిదా అయ్యారు. అవ్వడమే కాకుండా ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. ఇదిలా ఉంటే మొగులయ్య తాజాగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ క్రమంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటిన మొగులయ్య పచ్చదనం ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ పాటను ఆలపించారు. ‘తెలంగాణ మొత్తం మొక్కలు నాటాలి, దేశం పచ్చగా ఉండాలి.. వర్షాలు కురియాలి. దేశం పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలి. పచ్చదనంతో రోగాలు రావు’ అంటూ ఆలపించిన పాట పచ్చదనం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
ఇక మొక్కలు నాటిన తర్వాత మొగులయ్య మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో బాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, అప్పుడే దేశం పచ్చగా ఉంటుందని, అందరూ ఆరోగ్యంగా ఉంటార’ని చెప్పుకొచ్చారు.