AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆ ఒక్క మాటే కొంపముంచిందా ?.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..

బిగ్‎బాస్ సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక మొదటి ఎలిమినేషన్ అనుహ్యంగా ఎవరు ఊహించని

Bigg Boss 5 Telugu: ఆ ఒక్క మాటే కొంపముంచిందా ?.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 15, 2021 | 4:08 PM

Share

బిగ్‎బాస్ సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక మొదటి ఎలిమినేషన్ అనుహ్యంగా ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు నిర్వహకులు. అనుకున్నట్టుగానే ఎలిమినేషన్ కంటెస్టెంట్స్‏ను సేవ్ చేసి .. స్ట్రాంగ్ కంటెస్టెంట్‏ను ఎలిమినేట్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సరయు ఎలిమినేషన్ పై అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రకారమే సరయు ఇంటి నుంచి బయటపడిందా ? లేకా వేరే కారణముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెండో వారం నామినేషన్స్ జరిగాయి.

అయితే బిగ్‏బాస్ వ్యూహం ఎవరికీ అర్థం కాదు.. స్ట్రాంగ్ అనుకున్న వాళ్లను ఆకస్మాత్తుగా బయటకు పంపిస్తాడు. అదే వీక్ అనుకున్న కంటెస్టెంట్స్‏కు స్క్రీన్ స్పేస్ అమాంతం పెంచేసి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంటాడు. గత వారంలో సరయును ఎలిమినేట్ చేయడం కోసం… పూర్తిగా ఆమెకు నెగిటివ్ చూపించాడని సరయు అభిమానులు ఆరోపిస్తున్నారు. సిగరెట్ తాగడం.. కాజల్‌తో గొడవ పెట్టుకోవడం.. దూషించడం లాంటివి.. చూపించి.. పూర్తిగా నెగిటివ్ వైబ్ కలిగించేలా చేసాడు. ఇక సరయుకు సంబంధించి ఒక్క ఎపిసోడ్‏లో కూడా పాజిటివ్ లేకుండా చూసుకున్నాడు. ఇక అనుకున్నట్టుగానే సరయును ఎలిమినేట్ చేసేసాడు. ఇక రెండోవారంలో మరో కంటెస్టెంట్ బలి కాబోతున్నారు. ఆమెనే కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి.

రెండోవారం నామినేషన్స్‏లో భాగంగా.. ఉమాదేవి బూతులు మాట్లాడుతూ నానా హంగామా సృష్టించింది. ఇక ఆ తర్వాత కూడా ఆమె మాట్లాడిన ప్రతి మాటను రివీల్ చేస్తూ.. స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. దీంతో ఉమా దేవిపై ప్రేక్షకులకు నెగిటివ్ వైబ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఎక్కడా తగ్గకుండా.. నోటికి పదును పెడుతూ.. బూతుల పర్వం కొనసాగిస్తోంది ఉమాదేవి. దీంతో ఈసారి ఈమె ఇంటి నుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లో పాజిటివ్‏గా కనిపిస్తూ.. అందరితో బాగున్నా.. ఉమాదేవి.. ఇక రెండోవారం నామినేషన్స్ అనంతరం పూర్తిగా ఆట తీరే మ మార్చేసింది. తనతో మాట్లాడిన అందరితోనూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ.. ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేస్తుంది ఉమా. ఇంకేముంది.. బిగ్‏బాస్ సైతం ఉమాకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. దీంతో ఈసారి ఉమాదేవి ఇంటి నుంచి బయటకు రావడం ఖాయం అని తెలుస్తోంది.

Also Read: Rajamouli: మరో అద్భుతానికి తెర తీయనున్న జక్కన్న.. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం..?

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి