Prabhas: ప్రభాస్ – మారుతి సినిమాలో హీరోయిన్ భూమిక.. ఏ పాత్రలో కనిపించనుందంటే..
ప్రాజెక్ట్ కే, సలార్ మూవీస్ పై భారీగా అంచనాలు ఉండగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రాజెక్ట్ కూడా ఇటీవలే స్టార్ట్ చేశారు . ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కానుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ పాత థియేటర్లో సెట్ వేసి లేటెస్ట్ షెడ్యూల్ ను

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ డార్లింగ్ తో మూవీస్ చేసేందుకు బాలీవుడ్.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ కే, సలార్ మూవీస్ పై భారీగా అంచనాలు ఉండగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రాజెక్ట్ కూడా ఇటీవలే స్టార్ట్ చేశారు . ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కానుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ పాత థియేటర్లో సెట్ వేసి లేటెస్ట్ షెడ్యూల్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్.. రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ భూమిక కీలకపాత్రలో నటిస్తున్నారని సమాచారం. గతంలో నానికి వదినగా కనిపించిన భూమిక.. ఇప్పుడు ప్రభాస్ కు అక్కగా కనిపించనున్నారని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక రోల్ పాజిటివ్ ఉండగా.. మరో పాత్ర పూర్తిగా నెగిటివ్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్ కోసం మారుతి అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.




ఇక మరోవైపు ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రూపొందిన ఆదిపురుష్ వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీతగా కృతి సనన్ నటించగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.