K.G.F Chapter 2: సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ మేకర్స్.. చాప్టర్ 2 ఎండింగ్‌లో ఊహించని ట్విస్ట్

కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కేజీఎఫ్ మొదటి పార్ట్ సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ యశ్ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

K.G.F Chapter 2: సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ మేకర్స్.. చాప్టర్ 2 ఎండింగ్‌లో ఊహించని ట్విస్ట్
Kgf 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 14, 2022 | 3:51 PM

కేజీఎఫ్ 2(K.G.F Chapter 2) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కేజీఎఫ్ మొదటి పార్ట్ సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ యష్‌(Yash) ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కేజీఎఫ్ 1 విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ లోనూ సునామీ సృష్టించింది. హీరో ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కథ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కేజీఎఫ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. దాంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి నుంచి ‘కేజీఎఫ్ 2′ మొదట్టి పార్ట్ ను మించి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక నేడు విడుదలైన కేజీఎఫ్ 2 చూసిన ప్రేక్షకులు అదే అంటున్నారు. నేడు(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఫస్ట్ షో నుంచి కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

సినిమా చూసిన ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇస్తున్నారు. అడుగడుగునా ఎలివేట్‌ అయిన హీరోయిజమ్‌, తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల తాలూకు ప్రభావంతో పెరిగిన కుర్రాడ.. ఇలా సాగింది కేజీఎఫ్. దానికి కొనసాగింపే కేజీఎఫ్2. గరుడను చంపిన రాకీభాయ్‌గా, ఫస్ట్ పార్ట్ లో చూపించిన సేమ్‌ మేనరిజమ్‌, సేమ్‌ డైలాగ్‌ డెలివరీతో మాస్‌లో ఫైర్‌ పుట్టించే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు యష్‌. ఆయన గడ్డం, హెయిర్‌ స్టైల్‌, కోటు వేసుకున్న విధానం, తలకు గుడ్డకట్టుకునే తీరు, యాక్షన్‌ సీన్స్ లో అతను విజృంభించిన విధానం, జనాలతో పాటు కలిసిపోయి పనిచేసే సన్నివేశాల్లో చూపించిన ఈజ్‌ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేజీఎఫ్ పార్ట్ 3 గురించి చర్చ మొదలైంది. గతంలోనే కేజీఎఫ్ 3 ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే దీనిపై అటు ప్రశాంత్ నీల్ కానీ హీరో యష్‌ కానీ ఎక్కడ స్పందించలేదు. కానీ ఊహించని విధంగా కేజీఎఫ్ 2 చివరిలో కేజీఎఫ్ ఛాప్టర్ 3’ లోడింగ్ అంటూ మేకర్స్ సాలీడ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు పార్ట్ 3 ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ మోడలింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్