KGF Chapter 2 : వారాలు గడుస్తున్నా వసూల్ విషయంలో తగ్గదే లే అంటున్న కేజీఎఫ్ 2

కేజీఎఫ్.. ఎలాంటి హైప్ లేకుండా వచ్చి ఓవర్ నైట్ లో సంచలన విజయం సాధించింది ఈమూవీ. అప్పటివరకు ఎక్కువగా పరిచయం లేని యష్ ను అన్ని ఇండస్ట్రీలు గుర్తుపెట్టుకునేలా చేసింది ఈ సినిమా..

KGF Chapter 2 : వారాలు గడుస్తున్నా వసూల్ విషయంలో తగ్గదే లే అంటున్న కేజీఎఫ్ 2
Kgf 2
Follow us

|

Updated on: May 05, 2022 | 7:23 AM

కేజీఎఫ్(KGF).. ఎలాంటి హైప్ లేకుండా వచ్చి ఓవర్ నైట్ లో సంచలన విజయం సాధించింది ఈమూవీ. అప్పటివరకు ఎక్కువగా పరిచయం లేని యష్(Yash)ను అన్ని ఇండస్ట్రీలు గుర్తుపెట్టుకునేలా చేసింది ఈ సినిమా.. ప్రశాంత్ నీల్ మేకింగ్.. రాకీ భాయ్ గా యష్ యాక్టింగ్ ప్రేక్షకులను థియేట్సర్స్ లో సీట్ అంచున కూర్చోబెట్టాయి. పాన్ ఇండియా మూవీ వచ్చిన కేజీఎఫ్ అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ 2 మొదటి చాఫ్టర్ ను మించి సక్సెస్ అయ్యింది. ప్రేక్షకుల అంచనాలను మించి కేజీఎఫ్ 2 ఉండటంతో మరో యష్ బ్లాక్ బస్టర్ ను కట్టబెట్టారు సినీ లవర్స్. ఈ సినిమా విడుదలై వారాలు గడుస్తున్నా వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రికార్డులను తిరగరాస్తూ.. దూసుకుపోతున్న ఈ సినిమా ఇటీవలే 1000 కోట్ల మార్క్ ను దాటేసింది.

సినిమా విడుదలైన తర్వాత సెకండ్ షో కూడా పడకముందే 100 మార్క్ ను రాబట్టేసిందంటే అర్ధం చేసుకోవచ్చు కేజీఎఫ్ స్టామినా ఏంటో.. ఇప్పటికీ ఈ సినిమా రోజుకు దాదాపు 10 కోట్లవరకు వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈద్ హాలిడేని కూడా కేజీఎఫ్ 2 క్యాష్ చేసుకుంది. రంజాన్ రోజున కేజీఎఫ్ 2 సినిమా రూ. 8.25 నుంచి 8.60 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. ఇక మరో వారం, రెండు వారాల్లో ఈ సినిమా బాహుబలి 2 రికార్డులను అందుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. ఇక హిందీ దంగల్ సినిమా రికార్డ్ ను కూడా కేజీఎఫ్ 2 అందుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే దంగల్ 380కోట్ల రికార్డును బ్రేక్ చేసి 400 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఆ రికార్డులను రీచ్ అవుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్