Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: వేటమొదలు పెట్టనున్న లైగర్.. క్రేజీ అప్డేట్ ఇవ్వనున్న పూరీ అండ్ విజయ్.. ఎప్పుడంటే

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

Liger Movie: వేటమొదలు పెట్టనున్న లైగర్.. క్రేజీ అప్డేట్ ఇవ్వనున్న పూరీ అండ్ విజయ్.. ఎప్పుడంటే
Liger
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2022 | 6:53 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచి మొనీమధ్య వచ్చిన గ్లింప్స్‌ దాకా అన్నీ సినిమాకు క్రేజ్ పెంచే మూమెంట్సే. ఈ మధ్య బైటికొస్తున్న ప్రి-రిలీజ్ బిజినెస్ లెక్కలైతే లైగర్‌ స్టామినాకు శాంపిల్‌పీసెస్‌గా మారాయి. లైగర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 65 కోట్లకు అమ్ముడయ్యాయన్నది టాక్. ఓటీటీ హిస్టరీలో ఇదొక అండర్‌లైన్ చేసుకోదగ్గ డీల్ అట. ఇక థియేటర్ బిజినెస్ ఏ రేంజ్‌లో వుంటుందన్న అంచనాలు ఇండస్ట్రీలో జోరుగా షురూ అయ్యాయి.

అర్జున్‌రెడ్డిగా టాలీవుడ్‌లో పాత్‌బ్రేకర్ మూవీనిచ్చినా.. అప్పుడు వందకోట్ల క్లబ్బుకు దూరంగానే వున్నారు రౌడీ హీరో. తర్వాత గీతగోవిందం మూవీ విజయ్‌ని ట్రిపుల్ డిజిట్‌ స్టార్‌గా మార్చేసింది. పూరి గుడ్‌లుక్స్‌లో పడ్డాక.. లైగర్‌స్టార్‌గా ట్రాన్స్‌ఫామై స్టేచర్‌ని, మార్కెట్ వ్యాల్యూను పెంచుకుంటూ వెళ్తున్నారు విజయ్‌.ఇక ఈ మద్యే  హైదరాబాద్‌లో ఫైనల్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌తో బిజీగా వుంది లైగర్‌ మూవీ. తాజాగా ఈ సినిమానుంచి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఈనెల 9న సాయంత్రం నాలుగు గంటల నుండి లైగర్ వేట ఆరంభం కాబోతుంది అంటూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. 9న ఏం విడుదల చేయబోతున్నారు.. ఏం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాతో విజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. అలాగే లైగర్ లో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క