AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు.. ఈ లక్షణాలుంటే మాత్రం..

హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్జా-ఎ వైరస్‌ లక్షణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు మంట, పొడి దగ్గు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చేతుల శుభ్రత పాటించడం, రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం, లక్షణాలు తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ముఖ్యం. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడకూడదు.

జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు.. ఈ లక్షణాలుంటే మాత్రం..
Hyderabad Flu Cases
Shaik Madar Saheb
|

Updated on: Oct 12, 2026 | 11:28 AM

Share

హైదరాబాద్ నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ‘ఇన్‌ఫ్లుయెన్జా-ఎ’ (Influenza A) వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న రోగుల తాకిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వైరస్ వ్యాప్తికి కారణాలు – తీవ్రత:

ఉష్ణోగ్రతలలో వస్తున్న హెచ్చుతగ్గులు, ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతంగా పెరుగుతున్న చలిగాలుల ప్రభావం వల్ల ఈ వైరస్ గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంటున్నారు.. ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు: ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రుల ఓపీ (OP) విభాగాల ఎదుట జ్వరాల బాధితుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వచ్చే రోగులలో ఎక్కువ మంది తీవ్రమైన ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నవారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ అంటే..

ఇన్‌ఫ్లూయెంజా ఎ.. అనేది శ్వాసకోశానికి సంబంధించిన వైరస్‌.. సాధారణంగా దీనిని ఫ్లూ అని పిలుస్తారు.. ఇది ముక్కు, గొంతు, కొన్నిసార్లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, తుమ్ముల సమయంలో వెలువడే సూక్ష్మ తుంపరల ద్వారా, అలాగే వైరస్‌ కలుషితమైన చేతులు లేదా ఉపరితలాలను తాకి ఆ తర్వాత కళ్లు, ముక్కు, నోటిని తాకడం ద్వారా ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో, గాలి ప్రసరణ సరిగా లేని గదుల్లో వైరస్‌ వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతన్నారు..

ఇన్‌ఫ్లుయెన్జా-ఎ ప్రధాన లక్షణాలు:

ఈ వైరస్ సోకిన వ్యక్తులలో క్రింది రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు వెల్లడించారు..

  • ఆకస్మికంగా అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన తీవ్రమైన జ్వరం.. జ్వరం తగ్గకపోవడం
  • ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు – విపరీతమైన అలసట, స్పృహ కోల్పోవడం..
  • తలనొప్పి, గొంతు మంట, తీవ్రమైన పొడి దగ్గు..
  • కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతిలో బిగువుగా అనిపించడం.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..

ఎవరు అత్యంత ప్రమాదంలో ఉన్నారు?

చిన్నారులు – వృద్ధులు: రోగ నిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉండటం వల్ల ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ వైరస్‌కు అత్యంత సులువుగా బలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు: డయాబెటిస్ (మధుమేహం), హైపర్ టెన్షన్ (బీపీ), ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో ఇప్పటికే బాధపడుతున్నవారికి ఈ వైరస్ సోకితే పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు – వైద్యుల సూచనలు:

సెల్ఫ్ మెడికేషన్‌కు దూరంగా ఉండండి:

సాధారణ జ్వరమే కదా అని మెడికల్ షాపుల్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రాణాల మీదకు తెస్తుంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే అర్హులైన వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

వ్యక్తిగత శుభ్రత:

బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తూచా తప్పకుండా మాస్కులు ధరించడం మంచిది.

చిన్నారుల పట్ల అప్రమత్తత: పిల్లలకు జ్వరం లేదా దగ్గు లక్షణాలు ఉంటే వారిని బడులకు పంపకుండా ఇంట్లోనే విశ్రాంతినివ్వాలి. గోరువెచ్చని నీటిని తాగించడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..