AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వాడు లేకుంటే ఈ మ్యాచ్ గెలిచే వాళ్లం కాదు.. టర్నింగ్ పాయింట్ అదే..!

Shreyas Iyer comments India vs West Indies 3rd T20I: ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ, బౌలర్ల కీలక ప్రదర్శనతో భారత్ గెలిచింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆటగాళ్ల కృషిని ప్రశంసించాడు. ముఖ్యంగా అభిషేక్, ఇషాన్ కిషన్, ప్రిన్స్ యాదవ్ ల ఆటను కొనియాడాడు.

Venkata Chari
|

Updated on: Oct 12, 2026 | 10:11 AM

Share
Shreyas Iyer comments India vs West Indies 3rd T20I: ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసుకుంది. 14 పరుగుల తేడాతో గెలిచిన భారత్, సిరీస్‌లో తమ పట్టును నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ భారీ స్కోర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. అతను కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.

1 / 6
224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ విజయం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది. అయితే, కీలక సమయంలో భారత బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ రోమాంచిత విజయంలో పేసర్ అర్షదీప్ సింగ్, యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ అత్యంత కీలకంగా మారింది.

2 / 6
నితీష్ కుమార్ రెడ్డి 16వ ఓవర్లో దాటిగా ఆడుతున్న క్వెంటిన్ సాంసన్ వికెట్ను పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. అనంతరం 18వ ఓవర్లో అర్షదీప్ సింగ్ కీమో పాల్‌ను, ప్రమాదకరమైన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపడంతో వెస్టిండీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి ఓవర్లో వెస్టిండీస్ బ్యాటర్ షామర్ స్ప్రింగర్ మెరుపులు మెరిపించినప్పటికీ, అప్పటికే భారత్ విజయం ఖాయమైపోయింది. వెస్టిండీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది.

3 / 6
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టు విజయంపై స్పందించారు. "అభిషేక్ శర్మ నుంచి ఒక అద్భుతమైన ఆరంభం లభించింది. పవర్ ప్లేలో కీలకమైన పరుగులు వచ్చాయి. ముఖ్యంగా పవర్ ప్లేలో అతను ఏం చేయగలడో మాకు తెలుసు" అని అభిషేక్ ఆటను ప్రశంసించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చి బౌలర్లపై విరుచుకుపడిన తీరును, గత రెండు నెలలుగా అతని అద్భుతమైన ఆటను కొనియాడారు. మధ్యలో వికెట్లు కోల్పోయినప్పటికీ, ప్రత్యర్థి ముందు గట్టి టార్గెట్టే ఉంచగలిగామని అయ్యర్ పేర్కొన్నారు. చివర్లో ప్రిన్స్ యాదవ్ వచ్చి ఆడిన మెరుపు ఇన్నింగ్స్ (ఆరు బంతుల్లో 13 పరుగులు) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించిందని శ్రేయాస్ అయ్యర్ అన్నారు.

4 / 6
వెస్టిండీస్ జట్టును తేలికగా తీసుకోకూడదని తాను వ్యక్తిగతంగా భావించానని అయ్యర్ తెలిపారు. ఆ జట్టులో మ్యాచ్ గమనాన్ని మార్చగల ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఆట అంతా సానుకూలంగా ఉండాలని, ఏ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఉండకుండా చూసుకోవాలని ఆటగాళ్లకు సూచించానన్నారు. తదుపరి రెండు టీ20లు హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయని, అవి కూడా అధిక స్కోరింగ్ మైదానాలే కాబట్టి, ప్రస్తుత పద్ధతి, ప్రణాళికలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని శ్రేయాస్ అయ్యర్ నొక్కి చెప్పారు.

5 / 6
అలాగే, తమ విధానాల్లో మరింత దూకుడుగా ఉండేలా చూసుకోవాలని చెప్పుకొచ్చారు. బౌలర్ల ఆత్మవిశ్వాసంపై కూడా అయ్యర్ ప్రశంసలు కురిపించారు. "నేను వారికి బంతిని అందించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మేం ఈ మ్యాచ్ గెలిచేందుకు దోహదపడింది" అని అయ్యర్ అన్నారు. ప్రిన్స్ యాదవ్ బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లో వికెట్ తీయకపోయినప్పటికీ, విండీస్ బ్యాటర్లకు యార్కర్లను సంధించి వారిని ఇబ్బంది పెట్టారు. మొత్తంగా ఈ మూడో టీ20లో జట్టు సమష్టి కృషి మరియు వ్యూహాత్మక ప్రణాళికలే విజయానికి దోహదపడ్డాయని అయ్యర్ మాటల్లో స్పష్టమైంది.

6 / 6
Follow Us