10 గుంటల్లో సాగు.. 4 నెలల్లో రూ.16లక్షల ఆదాయం.. విదేశీ పంటతో లక్షలు గడిస్తున్న యువరైతు!
Gac Fruit Farming: కరోనా సమయంలో ఓ యువకుడికి వచ్చిన ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది. అంతా ఉద్యోగాల కోసం పట్టణాల బాట పడుతుంటే, ఏపీకి చెందిన ఈ యువకుడు మాత్రం నగరంలోని ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టాడు. వ్యవసాయాన్నే జీవనాధారంగా ఎంచుకుని, తనకున్న పొలంలో ఓ విదేశీ పంటను సాగు చేస్తూ ప్రస్తుతం లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాడు. పంట వేసిన కేవలం 4 నెలల్లోనే రూ.16 లక్షల రాబడితో అద్భుతం సృష్టించాడు. మార్కెట్లో కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పలికే గ్యాక్ ఫ్రూట్ పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి. శేషుబాబు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
