AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ వరుస చావులకు కారణమేంటి? ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ చూడాలనకుంటున్నారా? అయితే ఈ వెబ్ సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్. మొత్తం 9 ఎపిసోడ్లతో సాగే ఈ డార్క్ థ్రిల్లర్ సిరీస్ కు ఐఎమ్ డీబీలో టాప్ రేటింగ్ ఉంది. అలాగే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఆ వరుస చావులకు కారణమేంటి? ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 12, 2026 | 11:00 AM

Share

ఓటీటీ లో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్.. ఇలా అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఆడియెన్స్ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలు, వెబ్ సిరీసులపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా సేమ్ టు సేమ్ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ కు చెందినదే. మూఢనమ్మకాలు, పురాతన రహస్యాల నేపథ్యంలో చాలా డిఫరెంట్ గా సాగే హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సిరీస్ స్టోరీ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. అవని రౌత్ అనే నిజాయితీ గల ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఓవైపు భర్త మరణం, మరోవైపు అవినీతి ఆరోపణలతో ఆమె సతమతమవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు రాజస్థాన్‌లోని ‘శిలాస్పూర్’ అనే రహస్యమైన గ్రామానికి పోస్టింగ్ వస్తుంది. ఓ కార్పొరేట్ కంపెనీ తరపున అత్యంత విలువైన, అరుదైన ఖనిజాల మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వెళుతుంది. అయితే మైనింగ్‌ను గ్రామ పెద్దగా ఉండే స్వరూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. మైనింగ్ చేస్తే భూగర్భంలో ఉన్న ‘రిధ్యాకన్’ అనే క్రూరమైన రాక్షసుడు మేల్కొంటాడని, దానివల్ల ఊరికి ఊరే సర్వనాశనమైపోతుందని హెచ్చరిస్తాడు. కానీ ఎవరూ ఆయన మాట పట్టించుకోరు. చివరకు మైనింగ్ ప్రారంభిస్తారు. చివరకు ఊరి పెద్ద చెప్పినట్లే గ్రామంలో భయానక సంఘటనలు జరుగుతాయి. పక్షులు చనిపోతాయి. అనుమానాస్పద మరణాలు సంభవిస్తాయి.

మరి ఊరి పెద్ద చెప్పినట్లు వీటి వెనుక నిజంగా ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? లేక ఎవరైనా కావాలనే ఈ భయాన్ని సృష్టిస్తున్నారా? అవని ఈ సమస్యలను ఎలా సాల్వ్ చేసింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ డార్క్ హారర్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే. ఓటీటీలో ఉన్న ది బెస్ట్ హారర్ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే ఈ సిరీస్ పేరు ‘దహన్ – రాకన్ కా రహస్య’ (Dahan – Rakan Ka Rahasya). డైరెక్టర్లు విక్రాంత్ పవార్, జై శర్మ తెరకెక్కించిన ఈ సిరీస్ లో టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేష్ తైలాంగ్, ముకేశ్ తివారీ, రోహన్ జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 9 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా భయపెడుతోంది. ఐఎండీబీ రేటింగ్ కూడా 7.1గా ఉంది. ఒరిజినల్ హిందీ వెర్షన్ తో పాటు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

‘దహన్ – రాకన్ కా రహస్య’ వెబ్ సిరీస్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us