AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.! సీనియర్ నరేష్ షాకింగ్ కామెంట్స్..

సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అయినా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు నరేష్. ఇక సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.

పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.! సీనియర్ నరేష్ షాకింగ్ కామెంట్స్..
Naresh
Rajeev Rayala
|

Updated on: Oct 12, 2026 | 10:54 AM

Share

సీనియర్ నటుడు నరేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు నరేష్. ఇటీవల ఆయన లేకుండా సినిమాలు రావడం లేదు అనడంలో అతిశయోక్తిలేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల కారణంగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నరేష్ చేసిన వ్యాఖ్యలో అందరిని షాక్ కు గురిచేస్తున్నాయి. పెళ్లిళ్లు, విడాకులు, మారుతున్న బంధాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కళ్యాణం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇదే వేడుకలో పెళ్లి గురించి అనుపమ పరమేశ్వరన్ స్పందించిన తీరు కూడా ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకోవడం అనేది గతంలో కంటే కష్టంగా మారిపోయిందని నరేష్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని ఎంత ప్రయత్నించినా, అనుకున్న విధంగా సంబంధాలు కుదరడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితి కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ కనిపిస్తోందని అన్నారు. మరోవైపు, పెళ్లిళ్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేయడం, ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తితే విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం ఇలాంటివి పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో నేటితరం ఆలోచనా విధానం ఎలా మారుతుందో తనదైన శైలిలో వివరించారు.

ఈ క్రమంలోనే యువతను ఉద్దేశించి నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదని, కానీ పిల్లలను మాత్రం కనాలని ఆయన అన్నారు. సహజీవనం వంటి సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, పెళ్లి అనేది జీవితంలో జరిగే ఒక వేడుక మాత్రమే అన్నట్టుగా వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల నేపథ్యంలో పిల్లలను కనాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆయన సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే ఈ ఈవెంట్‌లో అనుపమ పరమేశ్వరన్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. అయితే, ప్రశ్న అడిగిన రిపోర్టర్‌కే ఆమె తిరిగి ప్రశ్నలు సంధించారు. ‘‘మీ పెళ్లై రెండు నెలలే అవుతోంది కదా.. అందుకే ఇంత ఆసక్తి ఉంది. ముందు మీ వైవాహిక జీవితం ఎలా ఉందో చెప్పండి. పెళ్లి చేసుకోవాలా వద్దా ? నొప్పిని భరిస్తూ నవ్వుతున్నారా.? రెండేళ్ల తర్వాత కూడా ఇలాగే చెప్పాలి’’ అంటూ సరదాగా స్పందించారు. ఈ కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us