Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి మరో అప్డేట్.. ప్రభుత్వం బిగ్ డెసిషన్.. కొత్త ఇళ్ల మంజూరు అప్పుడే..?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోండగా.. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. ఇలాంటివారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలో జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సొంతిల్లు లేని పేదల కోసం విడతల వారీగా ఇళ్లను రేవంత్ సర్కార్ మంజూరు చేస్తోంది. తొలి విడతలో గ్రామాల్లో ఉండేవారికి ఇళ్లను మంజూరు చేయగా.. వీటిల్లో దాదాపు మెజార్టీ శాతదం నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తైన ఇళ్లకు గృహప్రవేశాలు నిర్మిస్తున్నారు. అయితే సిటీలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు రెండో విడతలో ఇళ్లను కేటాయిస్తోంది. ఇటీవలే రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టగా.. తొలుత హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇక నుంచి జిల్లాల్లోనూ టవర్స్ నిర్మించి పేదలకు అందించనుంది. జిల్లాల్లోని విడతల వారీగా బహుళ అంత్తులను నిర్మించి లబ్దిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పట్టణాల్లోనూ ఇందిరమ్మ టవర్స్
హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్న తరహాలోనే పట్టణాలకు కూడా దీనిని విస్తరించారు. పట్టణ ప్రాంతాల్లో బహుళ అంతస్తు భవనాలు నిర్మించి అర్హులైనవారికి కేటాయించనున్నారు. తొలి విడతలో ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవన నిర్మాణల కోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రభుత్వ భూములను సేకరించగా.. డీపీఆర్ కూడా రూపొందిస్తున్నారు. ఈ టవర్లలో ఒక్కొ ఫ్లాట్ నిర్మాణానికి రూ.8 నుంచి రూ.9 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం అందనుండగా.. మిగతా సొమ్ము లబ్దిదారులు భరించుకుంటే సరిపోతుంది. లబ్దిదారుల చేతికి అదనంగా రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఒక్కొ ఫ్లాట్ నిర్మాణానికి రూ.11 లక్షల ఖర్చు అవుతుండగా.. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు పోనూ మిగతాది లబ్దిదారులు చెల్లించాలి. అయితే జిల్లాల్లో ఫ్లాట్ల నిర్మాణానికి తక్కువ ఖర్చు కానుంది. నాణ్యమైన ఇళ్లను లబ్దిదారులకు నిర్మించి అందించనున్నారు.
ఫ్లాట్ల కేటాయింపు షురూ..
ఇప్పటికే జిల్లాల్లో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ షురూ అవుతోంది. ఎలాంటి అవకతవకలకు చోటులేకుండా పారదర్శకంగా ఫ్లాట్ల కేటాయింపు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన పేదలకు ప్రయారిటీ పద్దతిలో ఈ ఫ్లా్ట్లు కేటాయించి మంజూరు పత్రాలు అందించనున్నారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో త్వరలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలు మొదలుకానున్నాయి. ఈ మేరకు హౌసింగ్ బోర్డ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అటు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తాజాగా గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపికబురు అందించారు. అర్హులైన ప్రతీఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఏ ఒక్కరికీ అందకుండా ఉండదని, విడతల వారీగా అందరికీ కేటాయిస్తామని తెలిపారు.
