AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth Daughter: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు.. హీరో ఎవరో తెలుసా.?

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో పాటు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో కొనసాగుతున్నారు.

Srikanth Daughter: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు.. హీరో ఎవరో తెలుసా.?
Srikanth Daughter
Rajeev Rayala
|

Updated on: Oct 12, 2026 | 11:24 AM

Share

టాలీవుడ్‌లో మరో స్టార్ ఫ్యామిలీ వారసురాలు హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక త్వరలో వెండితెరపై సందడి చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మేధను పరిచయం చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా శ్రీకాంత్ కుమార్తె హీరోయిన్‌గా ఎలా ఆకట్టుకోబోతున్నారనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. మేధ మేక కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ ఫేమ్ జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. కొత్త జంటతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. సోషల్ మీడియాలో ‘మైత్రీ ఇన్ లవ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. తమ మనసులను గెలుచుకున్న జై జాస్తి, మేధ మేకలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం వీరి పేర్లు మాత్రమే తెలుసని, త్వరలో తెరపై వీరి ప్రేమకథను చూసి ప్రేక్షకులు కూడా ప్రేమలో పడతారని అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. ఈ ప్రచారంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను అక్టోబర్ 12న (ఈ రోజు) విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలతో గుర్తింపు పొందిన పి. మహేష్ బాబు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీ వనం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి మేధ మేక హీరోయిన్‌గా పరిచయం అవుతుండటం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొత్తానికి, తల్లిదండ్రుల సినీ నేపథ్యం ఉన్నప్పటికీ మేధ మేక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారా.? జై జాస్తితో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!