KGF 2 Update: రాఖీ భాయ్ వచ్చే సమయం ఆసన్నమైంది.. కేజీఎఫ్ 2 వచ్చేదెప్పుడంటే…
KGF 2 Releasing Date Announced: విడుదల వరకు పెద్దగా అంచనాలు లేని కేజీఎఫ్ చిత్రం రిలీజ్ తర్వాత యావత్ సినిమా ఇండస్ట్రీని ఒక్కసారి తనవైపు తిప్పుకుంది. జాతీయ స్థాయిలో సంచనల విజయం సాధించిన తొలి కన్నడ మూవీగా...
KGF 2 Releasing Date Announced: విడుదల వరకు పెద్దగా అంచనాలు లేని కేజీఎఫ్ చిత్రం రిలీజ్ తర్వాత యావత్ సినిమా ఇండస్ట్రీని ఒక్కసారి తనవైపు తిప్పుకుంది. జాతీయ స్థాయిలో సంచనల విజయం సాధించిన తొలి కన్నడ మూవీగా రికార్డులు బద్దలు కొట్టింది. ఇక సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మొదటి చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడీ సినిమాపై అందరి కన్ను పడింది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది. ట్విట్టర్ వేదికగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. కేజీఎఫ్2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 16న విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపాడు. తొలి పార్ట్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన రావడంతో పార్ట్2 కోసం మరింత జాగ్రత్తలు తీసుకున్న ప్రశాంత్ అందుకుతగ్గట్లుగానే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖ తారలు ఉండేలా చూసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కేజీఎఫ్2 సినిమాతో పాటు ఏకకాలంతో ప్రభాస్‌తో ‘సలార్’ అనే సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని రామగుండంలో జరుగుతోంది.
#KGFChapter2 Worldwide Theatrical Release On July 16th, 2021.#KGFChapter2onJuly16@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/fFIEojSpmQ
— Prashanth Neel (@prashanth_neel) January 29, 2021