Acharya: మండు వేసవిలో వస్తున్న చిరు… ఆచార్య రిలీజ్ డేట్‌ను ప్రకటించిన దర్శకుడు కొరటాల శివ…
మెగాస్టార్ రాకకు ముహుర్తం ఖరారైంది. మండు వేసవిలో చిరంజీవి మరింత మంటపుట్టించనున్నారు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరు...
మెగాస్టార్ రాకకు ముహుర్తం ఖరారైంది. మండు వేసవిలో చిరంజీవి మరింత మంటపుట్టించనున్నారు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆచార్య మూవీ టీజర్ నేడు విడుదలైంది. అందులో చిరు ఆహార్యం, సంభాషణలు అదరగొడుతున్నాయి. టీజర్‌లో సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమా రానున్న డేట్‌ను ప్రకటించారు. మే 13న ఆచార్య రానుంది.
ఆచార్య షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. మొన్నీమధ్యే రామ్ చరణ్ కూడా షూటింగ్ లో అడుగు పెట్టడంతో నెల రోజుల్లోనే అంతా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది. మార్చి నుంచి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. కాజల్ అగర్వాల్ ఆచార్యలో హీరోయిన్ గా నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఆచార్యలో రియల్ హీరో సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆచార్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మిగిలిన నిర్మాతలు కూడా తమ తేదీలు అడ్జస్ట్ చేసుకుంటున్నారు.