Amitabh Bachchan: ‘షూటింగ్ అంటే భయమేస్తుంది.. పారిపోవాలనిపిస్తుంది’.. అమితాబ్ ట్వీట్ వైరల్
'షూటింగ్ అంటే భయంగా ఉంది.. పారిపోయి ఎక్కడైనా దాక్కోవాలనిపిస్తుంది'... ఇలాంటి మాటలు మెగాస్టార్ నుంచి వస్తాయని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా...?

Amitabh Bachchan: ‘షూటింగ్ అంటే భయంగా ఉంది.. పారిపోయి ఎక్కడైనా దాక్కోవాలనిపిస్తుంది’… ఇలాంటి మాటలు మెగాస్టార్ నుంచి వస్తాయని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా…? కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఫీలింగ్స్ ఇలాగే ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. కొత్త సినిమా షూటింగ్‌కు వెళుతూ తన టెన్షన్‌ను ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు షెహన్షా.
అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేస్తున్న ‘మేడే’ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ఫోటోను… అభిమానులతో షేర్ చేసుకున్న అమితాబ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘కొత్త సినిమా స్టార్ట్ చేసిన ప్రతీ సారి అది ఓ పీడకలలా అనిపిస్తుంది. ఏదో తెలియని భయం.. రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్’ అంటూ కొత్త నటుడిలా ఎగ్జైట్ అయ్యారు బచ్చన్ సాబ్.
ఈ సినిమాలో కీ రోల్‌లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్… బిగ్ బీ పోస్ట్ మీద రియాక్ట్ అయ్యారు. ‘ఈ మాట మేం చెప్పాలి.. మీతో కలిసి వర్క్ చేయటం నెర్వస్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంద’ని ట్వీట్ చేశారు. సీనియన్ హీరో మాధవన్ అయితే.. మీరే ఇలా టెన్షన్ పడితే మాలాంటి వాళ్ల పరిస్థితేంటి సర్… అంటూ రిప్లై ఇచ్చారు. బిగ్ బీ లాంటి వ్యక్తి కూడా కొత్త సినిమా విషయంలో చూపిస్తున్న అటెన్షన్ చూసి ఫ్యాన్స్ మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నారు.
T 3796 – नई फ़िल्म का पहला दिन , और हालत ख़राब ! tension apprehension नर्वस इयं pic.twitter.com/fH9IRhI1Dm
— Amitabh Bachchan (@SrBachchan) January 27, 2021
Also Read:
Acharya: మండు వేసవిలో వస్తున్న చిరు… ఆచార్య రిలీజ్ డేట్‌ను ప్రకటించిన దర్శకుడు కొరటాల శివ…
KGF 2 Update: రాఖీ భాయ్ వచ్చే సమయం ఆసన్నమైంది.. కేజీఎఫ్ 2 వచ్చేదెప్పుడంటే…