AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramcharan: నాన్న‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అదృష్టం… అవ‌కాశం క‌ల్పించిన కొర‌టాల శివ‌కు ధ‌న్య‌వాదాలు…

‘‘ఆచార్య’ సినిమాలో నాన్నతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం నా అదృష్టం. ‘సిద్ధ’ పాత్రలో నటిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇందులో...

Ramcharan: నాన్న‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అదృష్టం... అవ‌కాశం క‌ల్పించిన కొర‌టాల శివ‌కు ధ‌న్య‌వాదాలు...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 29, 2021 | 6:31 PM

Share

‘‘ఆచార్య’ సినిమాలో నాన్నతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం నా అదృష్టం. ‘సిద్ధ’ పాత్రలో నటిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇందులో నాది అతిథి పాత్ర కాదు. నా వరకూ ఇది పూర్తి నిడివి ఉన్న పాత్ర. నాన్న సినిమాలో నటించడానికి నాకు అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలు’ అని రామ్‌చరణ్ అన్నారు.

తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో స్ర్కీన్ పంచుకోవడం అదృష్టమని నటుడు రామ్‌ చరణ్‌ తేజ్‌ అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆచార్య’ టీజర్ విడుద‌ల సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ పై వ్యాఖ్య‌లు చేశారు. కాగా తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. కాగా సినిమా కోసం రామ్‌చరణ్‌ను ఎంపిక చేసుకోవడం గురించి కొరటాల స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో ‘సిద్ధ’ పాత్రకు రామ్‌చరణ్‌ తప్ప వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. ఈ ప్రాజెక్ట్‌కు, ఆ పాత్రకు ఆయనే సరైన న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. చిరంజీవికి జోడీగా కాజల్‌.. చరణ్‌కు జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.

Follow Us
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌