AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh Birthday: కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. మహానటి ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఇప్పటి వరకు హిట్ చిత్రాల్లో నటించిన కీర్తి.. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమపై ఫోకస్ పెట్టింది.

Keerthy Suresh Birthday: కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. మహానటి ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2024 | 11:58 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది ఈ బ్యూటీ. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకా దంపతుల ముద్దుల కుమార్తె కీర్తి. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కీర్తి.. బాలనటిగా వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం కథానాయికగా విమర్శకుల ప్రశంసలు అందుకుని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. 2013లో మలయాళంలో గీతాంజలి మూవీ ద్వారా హీరోయిన్‏గా కీర్తి, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె 2021లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది.

నివేదికల ప్రకారం ఇప్పటివరకు కీర్తి సురేష్ ఆస్తులు రూ.41 కోట్లు. ఆమె సంవత్సరానికి రూ.35 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. సినిమాలే కాకుండా ప్రకటనలు, బ్రాండ్ డీల్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా కీర్తి సంపాదిస్తుంది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్, ఎండార్స్‌మెంట్‌కి రూ.30 లక్షల వరకు వసూలు చేసిందని టాక్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్ చేసిన పోస్ట్ కోసం రూ.25 లక్షల వరకు తీసుకుంటుంది.

ఇది చదవండి : Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

ప్రస్తుతం కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో నివసిస్తుంది. అలాగే ఆమెకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‏లో ఆమెకు ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. కీర్తి వద్ద రూ.60 లక్షల విలువైన Volvo S90, రూ.1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్ 730Ld, రూ.81 లక్షల విలువైన Mercedes Benz AMG GLC43, టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ. రూ. 25 లక్షలు ఉన్నాయి. ఈరోజు కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇది చదవండి : OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?