Keerthy Suresh : ఓటీటీ బాట పట్టనున్న కీర్తి సురేష్ సినిమా.. ఈసారైనా హిట్ కొడుతుందా..
కీర్తిసురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది. తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ్‌లోనూ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటుంది...
Keerthy Suresh : కీర్తిసురేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది. తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ్‌లోనూ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటుంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక ఈ అమ్మడు కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ అలరిస్తుంది. ఈ క్రేమంలోనే ఆమె పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలో ఓటీటీ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. అయతే ఓటీటీ కీర్తిసురేష్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అయితే ఓటీటీ వేదికగా విడుదలైన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తిసురేష్ నటించిన ఓ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. తమిళంలో కీర్తి సురేశ్ ఒక విభిన్నమైన సినిమాను చేసింది. మహేశ్వరన్ దర్శకత్వంలో ‘సానికాయిధమ్’ రూపొందింది. ఈ సినిమాలో సెల్వ రాఘవన్ కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్ అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.
త్వరలో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌ను ఈ సినిమాకు అందించడానికి సిద్దమైందని తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కీర్తితో పాటు ఈ చిత్రంలో ప్రముఖ తారలు నటించారు. తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ నటించిన తొలి చిత్రం సాని కయిధం. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది కీర్తి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :