Katrina Kaif : తల్లిదండ్రులైన స్టార్ కపుల్.. మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్..
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. దీంతో కత్రీనా, విక్కీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నవంబర్ 7న కత్రీనా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయంతో తమ కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. ఈరోజు (నవంబర్ 7న) కత్రీనా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని తెలిపారు విక్కీ. “ఎంతో సంతోషంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అంటూ విక్కీ కౌశల్ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై స్పందిస్తూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కొన్నాళ్లు ప్రేమలో ఉన్న కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కత్రినా.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23న ప్రెగ్నెన్సీని ప్రకటించారు ఈ జంట.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..




