Kasthuri : కార్లు, టీవీలాంటివి ఏమీ లేవట.. ఈ హీరోయిన్ సంపదనంతా ఏం చేస్తుందో తెలుసా..

ఈ రోజుల్లో కనీసం కారు కూడా ఈ నటి ఉండదు. కానీ ఆమె కు కారు కూడా లేదట. పోనీ సినిమాలు లేక ఆర్థిక పరిస్థితి బాలేదా అంటే అదికాదు. సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ అంటూ బిజీగానే ఉంటుంది.

Kasthuri : కార్లు, టీవీలాంటివి ఏమీ లేవట.. ఈ హీరోయిన్ సంపదనంతా ఏం చేస్తుందో తెలుసా..
Actress Kasthuri
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2022 | 7:23 AM

సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్లు, కళ్ళుతిరిగే భవంతులు. కాలు కూడా కిందపెట్టకుండా బ్రతికేస్తుటారు. కొంతమందికి ప్రయివేట్ జెట్ లు కూడా ఉన్నాయి. ఇలా ఉంటుంది సినిమా తరాల లైఫ్. అయితే ఓ నటి మాత్రం ఇలాంటి హంగులు ఆర్భాటాలు ఏవి లేకుండా జీవిస్తుంది. ఈ రోజుల్లో కనీసం కారు కూడా ఈ నటి ఉండదు. కానీ ఆమె కు కారు కూడా లేదట. పోనీ సినిమాలు లేక ఆర్థిక పరిస్థితి బాలేదా అంటే అదికాదు. సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ అంటూ బిజీగానే ఉంటుంది. ఇంతకు ఆ నటి ఎవారా.? అనుకుంటున్నారా. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కస్తూరి. ఒకప్పుడు ఈ బ్యూటీ ‘నిప్పురవ్వ’, ‘ఆకాశ వీధిలో’, ‘మా ఆయన బంగారం’ లాంటి సినిమాల్లో నటించింది.

ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లతోపాటు పలు సినిమాల్లోనూ నటిస్తుంది కస్తూరి. రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలోనూ నటించింది. ఇక అసలు విషయం ఏంటంటే.. ఇటీవల కస్తూరి   చెన్నైలోని మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసింది. ఆ సమయంలో ఆమె ఫోన్ కనిపించకుండా పోయింది. వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో ఆమె ఫోన్  ను కనిపెట్టారు. దాంతో ఆమె చనై పోలీసులు పనితీరుతో తనకు చెన్నై పైన  గౌరవం మరింత పెరిగింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫాస్ట్ కు కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. మీరు కార్లు లేవా.. మెట్రోలో ఎందుకు ప్రయాణం చేశారు.? ఇదంతా దేనికి?.. పబ్లిసిటీ కోసమా?.. అంటూ ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ..‘నాకు సొంత కార్, టీవీ, ఏసీ లాంటివేవీ లేవు.. నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను’ అని రిప్లై ఇచ్చింది.. మరో నెటిజన్,సంపాదించినా డబ్బు ఏం చేస్తావ్? అని ప్రశించాడు దానికి  ‘నేను సంపాదించినదంతా మెడికల్ హెల్ప్, చైల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తెలిపింది. దాంతో ఈ అమ్మడి పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. నిజంగా కస్తూరి వ్యక్తుత్వానికి సెల్యూట్ చేయాల్సిందే అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి