Raviteja: రవి అన్న జర లుక్ మార్చరాదే.. ఫ్యాన్స్ మొత్తుకుంటున్నా మార్పు ఏది..?
తాజాగా వాల్తేరు వీరయ్య టీజర్‌లోనూ రవితేజ లుక్ రామారావు ఆన్ డ్యూటీకి కాపీలా ఉందంటూ ట్రోలింగ్ మొదలైంది. డైలాగ్ డెలవరీ నుంచి అన్నీ పరమ రొటీన్ అయిపోయాయి.
మాస్ రాజా కాస్తా మరీ మూస రాజాగా మారిపోతున్నారా..? పోస్టర్లపై టైటిల్స్ మారుతున్నా.. సినిమాల్లో కథలు మారుతున్నా.. రవితేజ లుక్ మాత్రం అక్కడే ఆగిపోయిందా..? లుక్‌పై కనీసం కాన్సట్రేషన్ కూడా చేయట్లేదా..? వరస ఫ్లాపులు వస్తున్నా.. రవితేజలో మార్పు రావట్లేదా..? తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య టీజర్‌తో మాస్ రాజాపై విమర్శలు మొదలయ్యాయి. ఒకప్పుడు రవితేజ ఇలా మాస్ పాటలు పాడుకుంటే.. థియేటర్స్ అన్నీ అదిరిపోయేవి. విజిల్స్ వేస్తూ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. అదే ఆయనకు మాస్ రాజా అనే బిరుదు కూడా తీసుకొచ్చింది. అయితే ఎంత మాస్ అయినా.. అప్పుడప్పుడూ కాస్త మేకోవర్ అయితే ఉండాలి లేదంటే బోర్ కొడ్తుంది. తాజాగా మాస్ రాజా విషయంలో జరుగుతున్నదిదే. రొటీన్‌కు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారనే విమర్శలొస్తున్నాయి రవితేజపై.
రవితేజ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు వాల్తేరు వీరయ్యలో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఏ సినిమా చూసినా.. అన్నింట్లోనూ ఒకేలా ఉన్నారు మాస్ రాజా. క్రాక్‌లో కోర మీసాలతో కాస్త లుక్ మార్చి.. కొత్తగా కనిపించారు రవితేజ. దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. తాజాగా రిలీజ్‌కు రెడీ అయిన ధమాకాల్లో సేమ్ టూ సేమ్ లుక్ దించేసారు ఈ సీనియర్ హీరో.
తాజాగా వాల్తేరు వీరయ్య టీజర్‌లోనూ రవితేజ లుక్ రామారావు ఆన్ డ్యూటీకి కాపీలా ఉందంటూ ట్రోలింగ్ మొదలైంది. డైలాగ్ డెలవరీ నుంచి అన్నీ పరమ రొటీన్ అయిపోయాయి. మరోవైపు ఇన్నేళ్ళూ ఫ్యాన్స్‌ను పెద్దగా పట్టించుకోని రవితేజ.. వరస ఫ్లాపులు వచ్చేసరికి తాజాగా అభిమానులతో ఫోటో సెషన్‌కు రెడీ అయ్యారు. ఈ మార్పేదో.. కథల్లో, లుక్స్‌లోనూ చూపిస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..