Prabhas: ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఆ సినిమా కోసం భారీ భూత్ బంగ్లా సెట్‌..

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కే, సలార్‌తో పాటు సందీప్‌ వంగ దర్శకత్వంలో సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వీటితో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఓ..

Prabhas: ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఆ సినిమా కోసం భారీ భూత్ బంగ్లా సెట్‌..
Prabhas Latest Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 14, 2022 | 9:52 PM

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కే, సలార్‌తో పాటు సందీప్‌ వంగ దర్శకత్వంలో సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వీటితో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు ప్రభాస్‌. మొదట్లో ఈ కాంబినేషన్‌పై చాలా వరకు నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావడంతో ఈ కాంబోలో సినిమా ఫిక్స్‌ అయ్యింది. పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌ తొలిసారి ఒక హారర్‌ అండ్‌ కామెడీ కాన్సెప్ట్‌ మూవీలో నటించనున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమై అప్‌డేట్ నెట్టింట సందడి చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు బుధవారం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రభాస్‌ ఫుల్‌ టైమ్‌లో నటించడం ఇదే తొలి రోజు కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ భారీ భూత్ బంగ్లాను సెట్‌ వేశారని తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీగా వేసిన సెట్‌లో ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిస్తోంది.

ప్రస్తుతం సలార్‌, ప్రాజెక్ట్ కే షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ మారుతి కోసం వారం రోజులపాటు కాల్షిట్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో