- Telugu News Photo Gallery Cinema photos Year Ender 2022 These movies are the most googled films in India in the year 2022 telugu cinema news
Year Ender 2022:ఈ ఏడాదిలో ఎక్కువ మంది వెతికిన సినిమాలు ఇవే.. మన తెలుగు చిత్రాలు ఎన్ని ఉన్నాయంటే..
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, కాంతార, పుష్ప చిత్రాలు రికార్డ్స్ క్రియేట్ చేయగా.. బాలీవుడ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. కానీ గూగుల్ లో ఆడియన్స్ ఎక్కువగా వెతికిన సినిమాలు మాత్రం కొన్ని ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Dec 14, 2022 | 6:40 PM

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, కాంతార, పుష్ప చిత్రాలు రికార్డ్స్ క్రియేట్ చేయగా.. బాలీవుడ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. కానీ గూగుల్ లో ఆడియన్స్ ఎక్కువగా వెతికిన సినిమాలు మాత్రం కొన్ని ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

బ్రహ్మాస్త్ర.. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ నటించారు. గూగుల్ సెర్చ్ లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

కేజీఎఫ్ 2.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మరోసారి రికార్డ్స్ క్రియేట్ చేసింది. గూగుల్ సెర్చ్ లో ఈ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

ది కాశ్మీర్ ఫైల్స్.. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలు సృష్టించినా.. వారంలోనే రూ. 100 కోట్లు రాబట్టింది. గూగుల్ సెర్చ్ లో 3వ స్థానంలో నిలిచింది.

Ram Charan - JR NTR

ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా.. బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసింది. డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గూగుల్ సెర్చ్ చేసినవారిలో ఈ సినిమా 5వ స్థానంలో నిలిచింది.

ఇక ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే . గూగుల్ సెర్చ్ లో ఈ సినిమా 6వ స్థానంలో నిలిచింది.

ఇక కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. గూగుల్ సెర్చ్ చేసినవారిలో ఈ మూవీ 7వ స్థానంలో నిలిచింది.




