AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Star Chiranjeevi : మెగాస్టార్ మరో లీక్ ఇచ్చేశారుగా.. వీడియో షేర్ చేసిన చిరంజీవి

బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు.

Mega Star Chiranjeevi : మెగాస్టార్ మరో లీక్ ఇచ్చేశారుగా.. వీడియో షేర్ చేసిన చిరంజీవి
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2022 | 7:15 AM

Share

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఎక్కలేదు. ఇక ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి  ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ సెకండ్ సాంగ్ గురించి లీక్ ఇచ్చేశారు. ‘నువ్వు శ్రీదేవివైతే.. నేను చిరంజీవిని అవుతా..’ అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ‘‘డిసెంబ‌ర్ 12న నేను, శ్రుతీ హాసన్ కలిసి చేసిన సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేశాం. సాంగ్‌, అందులో విజువ‌ల్స అద్భుతంగా వ‌చ్చాయి. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. లొకేష‌న్ గురించి చెప్పాలంటే బ్యూటీఫుల్‌గా ఉంది. -8 డిగ్రీల చ‌లిలోనే డాన్స్ చేయాలంటే చాలా క‌ష్టంగా అనిపించింది. అంత క‌ష్ట‌మైన‌ప్ప‌టికీ మీ కోసం ఇష్ట‌ప‌డి చేశాను. స్విజ‌ర్లాండ్, ఇట‌లీ బోర్డ‌ర్‌లోని ఆల్ఫ్స్ ప‌ర్వాతాల్లో లేజే లోయ‌లో ఉండే లొకేష‌న్‌ ఇది. మంచుతో క‌ప్పేసిన‌ప్పుడు ఆ లోయ అందాలు ఇంకా గొప్ప‌గా ఉన్నాయి. నేను ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఆపుకోలేక మీకు విజుల్స్ పంపుతున్నాను’’అంటూ ఓ వీడియోను షేర్ చేశారు చిరు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాలో చిరంజీవితోపాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇటీవలే రవితేజ కు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 13న రిలీజ్ అవుతుంది వాల్తేరు వీరయ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!