20ఏళ్ళు సాగిన కోర్టు కేసు.. సంచలనంగా మారిన తుది తీర్పు.. ప్రముఖ నటికి జైలు శిక్ష..

ఓ హీరోయిన్ కు ఏకంగా రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ కేసు ఇప్పటిది కాదు 20ఏళ్ల క్రితంది. అప్పుడెప్పుడో కోర్టుకెక్కిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడి చివరకు ఇప్పుడు తీర్పు వచ్చింది.

20ఏళ్ళు సాగిన కోర్టు కేసు.. సంచలనంగా మారిన తుది తీర్పు.. ప్రముఖ నటికి జైలు శిక్ష..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2022 | 7:04 AM

ఈ మధ్యకాలం సినిమా తారలంతా తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇతర కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కు ఏకంగా రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ కేసు ఇప్పటిది కాదు 20ఏళ్ల క్రితంది. అప్పుడెప్పుడో కోర్టుకెక్కిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడి చివరకు ఇప్పుడు తీర్పు వచ్చింది. దాంతో ఓ నటి రెండేళ్లు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇంతకు ఏమైందంటే.. అభినయ కన్నడలో పాపులర్ నటి. ఈమె ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళింది. 1971లో పుట్టిన అభినయ 1984లో తన 13వ ఏట కాశీ విశ్వనాథ్ ‘అనుభవ’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ సమయంలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తరవాత ఆమెకు అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఈ నటి తన తమ్ముడు వివాదంలో కేసులో ఇరుక్కుంది.

అభినయ సోదరుడికి 1998లో లక్ష్మీదేవితో వివాహమైంది. ఆ సమయంలో కట్నంగా రూ. 80 వేల నగదు, 250 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే ఆదానవు కట్నం కోసం లక్ష్మీదేవిని వేధించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 2002లో లక్ష్మీదేవి బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. అభినయతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.అయితే 2012లో మెజిస్ట్రేట్ కోర్టు వీరికి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే జిల్లా కోర్టు ఈ తీర్పు పై స్తే విధించింది. దాంతో లక్ష్మీదేవి హైకోర్టులో అప్పీలు వేసింది. ఇన్నాళ్లు ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఇప్పటికి తిది తీర్పు వచ్చింది. ఇదిలా ఉంటే కొద్దికాలం క్రితం  అభినయ సోదరుడు, ఆమె తండ్రి చనిపోయారు. దాంతో అభినయ, ఆమె తల్లి, మరో సోదరుడు చెలువకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.

ఇవి కూడా చదవండి
Abinya

abinaya