Thalapathy vijay: అందుకే ఆయనను దళపతి అంటారు.. ఫ్యాన్స్‌తో భేటిఅయిన విజయ్

ఇక విజయ్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనలోని సింపుల్ సిటీని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు దళపతి విజయ్.

Thalapathy vijay: అందుకే ఆయనను దళపతి అంటారు.. ఫ్యాన్స్‌తో భేటిఅయిన విజయ్
Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2022 | 6:20 AM

దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా ఆయనకు బాగానే ఫ్యాన్ బేస్ ఉంది. ఇక విజయ్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనలోని సింపుల్ సిటీని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు దళపతి విజయ్. ఆయన సినిమాలన్నీ మినిమం 200కోట్లు వసూల్ చేస్తాయి. చివరిగా విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కోలీవుడ్ లో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్.

తాజాగా విజయ్ అభిమానులతో సమావేశం అయ్యారు. విజయ్ చెన్నైలోని పనైయుర్ లో ఉన్న తన కార్యాలయంలో అభిమానులతో భేటీ అయ్యారు.  అరియాలూర్, పెరంబలూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశం అయ్యాడు. ఈ సమావేశంలో అభిమానుల మధ్య జరుగుతున్న వివాదం గురించి విజయ్ చర్చించాడు.

ఇవి కూడా చదవండి

అలాగే వారసుడు సినిమా గురించి కూడా అభిమానులతో చర్చించారు విజయ్. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వికలాంగుడైన ఓ అభిమానిని ఎత్తుకొని ఫోటో దిగాడు విజయ్. విజయ్ మంచి మనసుకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి