Vaarasudu: ఒకే వేదిక పై ఇద్దరు స్టార్ హీరోలు.. దళపతి వారసుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ ఆ హీరోనేనా.?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vaarasudu: ఒకే వేదిక పై ఇద్దరు స్టార్ హీరోలు.. దళపతి వారసుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ ఆ హీరోనేనా.?
Vaarasudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2022 | 7:40 AM

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారీసు. ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగా ప్రాజెక్ట్ తలపడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యతోపాటు.. నందమూరి నటసింహా రెడ్డి చిత్రాలతో ఢీకొటట్నుంది. అలాగే..తమిళంలో స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తోన్న తునివు కూడా పొంగల్ బరిలో నిలిచింది.అయినా వారసుడు సినిమా వెనకడుగు వేయడం లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్  ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరుకానున్నారని టాక్. మహేష్ బాబు వంశీ పైడిపల్లికి మంచి ప్రెండ్ అన్న విషయం తెలిసిందే.

అలాగే మహేష్ కు విజయ్ అంటే ఇష్టమని గతంలో పలుసార్లు చెప్పాడు. దాంతో ఈ ఈవెంట్ కు మహేష్ హారాజుకానున్నాడన్న వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.  ఇక ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే వేదిక పై కనిపిస్తే ఇంకేమైనా ఉందా ఫ్యాన్స్ కు పూనకాలే. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి