AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: అందంగా లేవు అని బయటకు గెంటేశారు.. ఎవరైతే నన్ను దూరం పెట్టారో వాళ్లకి నేను చెప్తున్నా..

అందరి ఎమోషనల్ వీడియోలు చూపించి అందరిలో విన్నర్ ఆశలను చిగురించేలా చేశాడు బిగ్ బాస్. అయితే అందరికంటే చివరిగా కీర్తి జర్నీ చూపించాడు.

Bigg Boss 6 Telugu: అందంగా లేవు అని బయటకు గెంటేశారు.. ఎవరైతే నన్ను దూరం పెట్టారో వాళ్లకి నేను చెప్తున్నా..
Keerthi Keshav Bhat
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2022 | 8:00 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఆరుగురు హౌస్ లో ఉన్నారు. వీరిలో ఐదుగురు టాప్ 5లోకి వెళ్తారు. హౌస్ లో ఉన్నవారిలో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి. వీరిలో ఒకొక్కరిని పిలిచి 100 డేస్ జర్నీ వీడియోలను చూపించారు బిగ్ బాస్. అందరి ఎమోషనల్ వీడియోలు చూపించి అందరిలో విన్నర్ ఆశలను చిగురించేలా చేశాడు బిగ్ బాస్. అయితే అందరికంటే చివరిగా కీర్తి జర్నీ చూపించాడు. దాంతో ఆమె ఈ వారం మధ్యలో ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. మరి ఏంజరిగిద్దో చూడాలి. ఇక కీర్తిని బిగ్ బాస్ తెగ పొగిడేశాడు. అంతకు ముందు ఆదిరెడ్డి ని పిలిచి అతని జర్నీ చూపించాడు బిగ్ బాస్. దాంతో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు పనికిరాని తనని బిగ్ బాస్ ప్రయోజకుడ్ని చేసిందని, బిగ్ బాస్ రివ్యూలు చెప్పటంతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నాడు ఆదిరెడ్డి.

ఇక కీర్తి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ..”నిజ జీవితం కల్పితం కన్నా ఎంతో నాటకీయమైనది. ఒకవైపు బరువైన గతం లోలోపల దాడి చేస్తుంటే.. మొండి ధైర్యంతో పోరాడారు. అడవిలో మహావృక్షం ఒక్కటే ఉంటుంది. అది తాను ఒంటరిని అని తల వంచితే ఆకాశాన్ని తాకే తన ఎదుగుదలను చూడలేదు. ఇంట్లో మిమ్మల్ని అర్ధం చేసుకునే వారు కనపడక కలవరపడ్డారు. మీకంటూ కుటుంబం లేదని బాధపడినా.. సింపథీ కోసం మీ ప్రయత్నమని నిందించినా.. మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి.. పద్నాలుగు వారాల సుదీర్ఘప్రయాణం తర్వాత.. గ్రాండ్ ఫినాలేకి చేరాలనే కోరిక మీ ఒక్కరిదే కాదు.. మీ కుటుంబానిది కూడా. కుటుంబం అంటే ఒక్కరు కాదు.. మీ కుటుంబ సభ్యుల సంఖ్య కొన్ని లక్షలు కష్టాల పై నిర్మించే పునాదులను కదపడం అంత సులభం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత కీర్తి జర్నీ వీడియోను చూపించారు.

ఆ తర్వాత కీర్తి మాట్లాడుతూ..‘ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఎవరు నన్ను ఛీ.. తూ.. అన్నారో.. నువ్వు అందం లేవు అని బయటకు గెంటేశారో.. ఎవరైతే నన్ను దూరం పెట్టారో వాళ్లకి నేను చెప్తున్నా.. ఇది కీర్తి అంటే.. ఈరోజు నా అమ్మానాన్న ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను. నా బిడ్డ జీవితం ఏమౌతుందో అని వాళ్లు పైనుంచి చూసి ఏడుస్తుంటారు. కానీ వాళ్లు ఈరోజు నన్ను చూసి సంతోషపడతారు. ఈ బిగ్ బాస్ వల్ల నాకు పెద్ద ఫ్యామిలీ దొరికింది.. అంటూ ఎమోషనల్ అయ్యింది కీర్తి

ఇవి కూడా చదవండి