Pathaan: చిక్కుల్లో షారుక్ ఖాన్ మూవీ.. దీపికా పదుకోన్‌‌పై మండిపడుతున్న బీజేపీ నేతలు

ట్విట్టర్‌లో బాయ్ కాట్ పఠాన్ సినిమా అని ట్రెండ్‌ అవుతోంది. దీపికా పదుకొనే దుస్తులపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాషాయం బిక్నీ ధరించి డ్యూయెట్‌ సాంగ్‌లో నటించడంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు.

Pathaan: చిక్కుల్లో షారుక్ ఖాన్ మూవీ.. దీపికా పదుకోన్‌‌పై మండిపడుతున్న బీజేపీ నేతలు
Pathan
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Dec 15, 2022 | 8:39 AM

కింగ్‌ఖాన్‌ షారూఖ్‌ , దీపికా పదుకోన్‌ నటించిన పఠాన్‌ సినిమా లోని భేషరమ్‌ సాంగ్‌పై వివాదం మరింత రాజుకుంది. ఈ పాటను చాలా అశ్లీలంగా చిత్రీకరించారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ట్విట్టర్‌లో బాయ్ కాట్ పఠాన్ సినిమా అని ట్రెండ్‌ అవుతోంది. దీపికా పదుకొనే దుస్తులపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాషాయం బిక్నీ ధరించి డ్యూయెట్‌ సాంగ్‌లో నటించడంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హిందువుల మనోభావాలను ఈ పాట గాయపర్చిందని ఆరోపిస్తున్నారు.

విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో మిలియన్‌‌‌‌‌‌‌‌ వ్యూస్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తోంది. . కానీ, ఈ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై మాత్రం వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఈ మధ్య బాలీవుడ్ పాటలు ఇన్ స్టా రీల్స్ కంటే చెత్తగా ఉన్నాయని కొంతమంది విమర్శిస్తున్నారు. బేషరమ్‌ పాట లోని అభ్యంతరకరమైన సీన్లను తొలగించాలని మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా డిమాండ్‌ చేశారు. లేదంటే మధ్యప్రదేశ్‌లో సినిమా ప్రదర్శనకు అనుమతిపై ఆలోచిస్తామన్నారు. దీపికా పదుకోన్‌ జేఎన్‌యూలో తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతిచ్చారని , ఇలాంటి పాటలో నటించి మరోసారి హిందువుల మనోభావాలు గాయపర్చారని అన్నారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్‌లో పఠాన్‌ లాంటి చెత్త సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయని , ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు బహిష్కరించాలని అన్నారు హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి. బీజేపీని టార్గెట్ చేయడానికే కాషాయ రంగు బికినీ వేసి బేషరమ్ రంగ్ అంటూ పాటను విడుదల చేశారని కొందరు షారుక్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ పాటలో దీపికా మరో రెండు రంగుల బికినీలు కూడా ధరించింది, దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..