Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: నేను తీసింది సినిమా.. డాక్యుమెంటరీ కాదు.. కన్నప్ప సినిమా ట్రోలర్స్‌పై షాకింగ్ కామెంట్స్

మంచి విష్ణు తాజా సినిమా కన్నప్ప సినిమా నుంచి రిలీజైన ఓ సాంగ్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా షూటింగ్ నుంచి నిత్యం వివాదాల్లో, వార్తల్లో నిలుస్తూనే ఉంది. శివయ్య సాంగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే కాదు.. లవ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్న నేపధ్యంలో మంచి విష్ణు ఈ విమర్శలపై స్పందించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేక విషయాలను పంచుకున్నాడు.

Manchu Vishnu: నేను తీసింది సినిమా.. డాక్యుమెంటరీ కాదు.. కన్నప్ప సినిమా ట్రోలర్స్‌పై షాకింగ్ కామెంట్స్
Kannappa Movie
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2025 | 1:18 PM

ఆధ్యాత్మిక, హిస్టారికల్ నేపధ్య సినిమాలను తెరకెక్కించడం అంటే ఒక సాహసం అని చెప్పవచ్చు. అందునా ఒకసారి తీసిన కథతో మరోసారి సినిమా తీయడం అంటే ఆలోచించాలి. ఎందుకంటే రెండు సినిమాలను పోల్చి చూస్తారు. భక్త కన్నప్ప అనగానే కృష్ణరాజు కనిపిస్తాడు అందరికీ.. అంతగా కృష్ణ రాజు తన నటనతో ప్రేక్షకుల మదిలో తిష్ట వేశాడు. మరి అలాంటి సినిమాను మళ్ళీ తెరకెక్కించే ప్రయత్నం చేశాడు విష్ణు. తనపై విమర్శలను పక్కకు పెట్టి హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను తెరక్కించాడు. ఈ సినిమా వేసవి వినోదంగా ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశాడు. పలు ఆసక్తికరమైన విశేషాలను తెలిపాడు.

భక్త కన్నప్పగొప్ప శివ భక్తుడు.. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నాడుగా బోయ వంశంలో జన్మించాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో వేట సాగిస్తూ జీవనం సాగించేవాడు. అడవిలో వెళ్తున్న సమయంలో శివలింగానికి చూసి శివయ్య భక్తుడిగా మారాడు. ఆ తిన్నాడు.. భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. అలాంటి కన్నప్ప చరిత్రను తెరకెక్కిస్తూ మూలాలకు దూరంగా అంటే విదేశాల్లో ఈ సినిమా ను షూట్ చేయడంపై విమర్శలు తలెత్తాయి.

ఇటీవల రిలీజ్ చేసిన కన్నప్ప సినిమాలోని లవ్ సాంగ్ పై నెట్టింట వస్తున్న విమర్శలపై స్పందించాడు. భక్తీ సినిమాల్లో గ్లామర్ అవసరం అన్న విషయంపై మాట్లాడుతూ..  కన్నప్ప సినిమాలో మంచి లవ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. అంతేకాదు 2 వ శతాబ్ధంలో అప్పటి వారు ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయి.. అప్పటి పరిసరాలు అంటూ రకరకాల లాజిక్స్ తో విమర్శిస్తూ ఉంటారు. శివుడి పై రిలీజ్ చేసిన పాటపై కూడా విమర్శలు వచ్చినప్పుడు నవ్వుకున్నా అని చెప్పారు విష్ణు. ఎందుకంటే కొంతమంది ఎప్పుడూ విమర్శించాడాకే చూస్తారు.. నేను తీస్తుంది సినిమా.. డాక్యుమెంటరీ కాదు.. అందుకే  కన్నప్ప సినిమాలో అన్ని రకాల యాంగిల్స్ అంటే కమర్షియల్ యాంగిల్ కూడా ఉందని చెప్పారు విష్ణు.

ఇవి కూడా చదవండి

తన సినిమాని ఓటీటీకి అమ్మడం లేదని.. తను సినిమా కోసం పెట్టిన బడ్జెట్ కు ఓటీటీకి అమ్మడం వలన నష్టపోతానని.. తన మార్కెటింగ్ టెక్నిక్ తనది అని చెప్పడమే కాదు.. ఈ  కన్నప్ప సినిమా తన కెరీర్ లో చేస్తున్న పెద్ద రిస్క్ అయినా సరే శివయ్య అన్ని చూసుకుంటాడు.. తనని కాపాడుతాడు అని ధీమా వ్యక్తం చేశాడు మంచు విష్ణు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..