తప్పు చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అషు.. తల్లి కాళ్ల మీద పడి క్షమాపణలు
అషు రెడ్డి.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ.

హాట్ బ్యూటీ అషు రెడ్డి.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. దాంతో ఈ చిన్నదాని పేరు బాగా వైరల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది.ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ లో తనదైన ఆటతోపాటు అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. అషు రెడ్డి కొన్ని సినిమాల్లోనూ నటించింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ సన్సేషన్ అనే చెప్పాలి.
కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం చేయలేదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు. బిగ్ బాస్ నుని బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుసగా షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది ఈ హాట్ బ్యూటీ.
ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ షోలో పాల్గొంది అషు రెడ్డి. ఈ టీవీ షోకు తన తల్లితో కలిసి హాజరయ్యింది. అయితే ఈ షోలో తన తల్లి దగ్గర ఎమోషనల్ అయ్యింది అషు రెడ్డి. తాను ఓ ఇంటర్వ్యూ చేయడం వల్ల తన తల్లి బాధపడిందని, బాధపెట్టినందుకు క్షమించాలంటూ ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే అషు తప్పు చేశాను అంటూ ఎమోషనల్ అయ్యింది ఆర్జీవీ ఇంటర్వ్యూ గురించే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి, ఆర్జీవీతో ఓ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ చాలా బోల్డ్ గా చేసింది. ఈ ఇంటర్వ్యూలోనే ఆర్జీవీ అషు కాలు నోట్లో పెట్టు కోవడం లాంటి పనులు చేశారు. అలాగే కాస్త బోల్డ్ గానూ మాట్లాడుకున్నారు. ఈ ఇంటర్వ్యూ పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు అషు ఆ ఇంటర్వ్యూ గురించే మాట్లాడిందని నెటిజన్స్ అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..