Kantara: ప్రభాస్ నా సినిమాను అన్ని సార్లు చూశారట.. ఆనందం వ్యక్తం చేసిన కాంతార హీరో
కన్నడనాట ఓ చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది.కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార..

కన్నడ మూవీ కాంతార సినిమా క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. కన్నడ ఇండస్ట్రీ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కన్నడనాట ఓ చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది.కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కీ, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది కాంతార మూవీ . ఇక విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్ ధనుష్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమాను చూసి సూపర్బ్ అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ సినిమా పై డార్లింగ్ ప్రభాస్ స్పందిస్తూ.. చిత్రయూనిట్ పై హీరో రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపించారు. దీనిపై హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ..’ మన రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మాత్రం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నానని తెలిపారు. డార్లింగ్ ప్రభాస్ ఇప్పటికే ‘కాంతార’ మూవీని రెండు సార్లు చూశాడట.. ముచ్చటగా మూడోసారి కూడా చూడడానికి ఆయన రెడీగా ఉన్నారని తెలుస్తోంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రిషబ్ శెట్టి.
కాగా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన కాంతార రూ.200 కోట్లవైపు దూసుకెళుతోంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు.








