AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hunt Movie : సుధీర్ బాబు సినిమా టైటిల్ పై ముదురుతున్న వివాదం.. ప్రొడ్యూసర్లకు నోటీసులు

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో రానున్నాడు.

Hunt Movie : సుధీర్ బాబు సినిమా టైటిల్ పై ముదురుతున్న వివాదం.. ప్రొడ్యూసర్లకు నోటీసులు
Hunt
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2022 | 8:36 AM

Share

కథలో బలముంటే చాలు సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు.  తాజాగా ఈ కుర్ర హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో రానున్నాడు. ఈ సినిమాకు హంట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే హంట్ టైటిల్ పై వివాదం రేగింది. ఈ టైటిల్ మాది అంటున్నారు డైరెక్టర్ , హీరో నిక్షిత్

శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో జూలై లొనే “హాంట్” అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరఫున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళకి వారి టీం కి నోటీసులు పంపి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ & హీరో నిక్షిత్ మాట్లాడుతూ “తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తర్వాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్ ని అప్ప్లే చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్ రిజెక్ట్ చేశారు, ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆమోదం చేశారు.

ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు కొంతమంది సినీ పెద్దలు, అందుకోసం మా లాయర్ ద్వారా వాళ్లందరికీ నోటీసులు పంపించారు, మా టైటిల్ మాకు వచ్చే అంతవరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం” అని తెలిపారు”. అలాగే అడ్వకేట్ సురేష్ బాబు మాట్లాడుతూ “శ్రీ క్రియేషన్స్ వారి తరపున నేను వకాలత్ నామా నేను తీసుకున్నాను, వీరి వైపు న్యాయం ఉంది, నేను కూడా ఒక నిర్మాతనే, నిర్మాతల బాధలు, వారి కష్టాలు నాకు తెలుసు, ఏ నిర్మాత నష్టపోకూడదు అనేది నా కోరిక, ఒక్క సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ని వేరే ప్రొడ్యూసర్ కి ఆ టైటిల్ ని ఆమోదం చేయడం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పిదమే, అందుకోసం వారి తరపున నేను వాదిస్తున్నాను అని అన్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్