Kichcha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం.. తల్లి సరోజ కన్నుమూత..

కన్నడ స్టార్ హీరో సుదీప్ తల్లి సరోజ కన్నుమూసింది. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నిన్న ఉదయం జయనగర్ లోని అపోలో ఆసుపత్రిలోని చేరింది. చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచింది.

Kichcha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం.. తల్లి సరోజ కన్నుమూత..
Kichcha Sudheep
Follow us

|

Updated on: Oct 20, 2024 | 11:43 AM

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా జయనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సుదీప్ తల్లి సరోజ ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు సరోజ పార్థివదేహాన్ని జేపీ నగర్‏లోని సుదీప్ నివాసానికి తీసుకురానున్నారు.  తన తల్లి అనారోగ్యం కారణంగా, సుదీప్ నిన్న తెల్లవారుజామున బిగ్ బాస్ షూటింగ్ పూర్తి చేసాడు. సుదీప్ తల్లి సరోజ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవలే బిగ్ బాస్ వేదికపై తన తల్లిని గుర్తుచేసుకున్నాడు సుదీప్. ఈ సీజన్ ఫస్ట్ వీకెండ్ లో షేర్వాణీ వేసుకుని చెప్పులు లేకుండా వచ్చాడు సుదీప్. నవరాత్రి కావడంతో ఇలా చెప్పులు లేకుండా వచ్చానని చెబుతూ.. నవరాత్రులకు ఇలా ఉంటున్నానని తన తల్లికి చెబుతున్నట్లు కెమెరావైపు చూపించాడు.

సుదీప్ తల్లి మంగళూరు. ఆమె మాతృభాష తుళు. ఆ భాష అంటే తనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో సుదీప్ చెప్పుకొచ్చాడు. కానీ తనకు తుళు భాష అర్థమవుతుందని.. మాట్లాడలేనని అన్నారు. సుదీప్ తల్లి సరోజ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె ఇదివరకే తన కొడుకు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంది. సుదీప్ కన్నడ సినీరంగంలో అగ్ర హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఎస్ఎస్ రాజమౌళి, నాని కాంబోలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు సుదీప్. సుదీప్ తల్లి భౌతికకాయాన్ని ఉదయం 11 గంటలకు జెపి నగర్ నివాసానికి తీసుకురానున్నారు, సుదీప్ ఇంటి దగ్గర చివరి దర్శనానికి ఏర్పాట్లు కూడా చేశారు.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!