Bigg Boss: బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. స్టార్ హీరో సుదీప్ ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11 వరుసగా వివాదాలు ఎదుర్కొంటోంది. కొత్త సీజన్ ప్రారంభమై 19 రోజులు అవుతుండగా, ఇప్పటికే పలు కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సమస్యలో చిక్కుకుంది కన్నడ బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్‌లో మహిళా కంటెస్టెంట్ల గోప్యతకు భంగం కలుగుతోందని మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా ఇటీవల ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. అలాగే ఈ షోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ మేల్కొని ఈసారి నరకం-స్వర్గం అనే భావనకు స్వస్తి పలికి కంటెస్టెంట్స్ అందరూ ఒకే హౌస్ లో ఉండే అవకాశం కల్పించారు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ టీమ్ కు మరో చిక్కు ఎదురైంది. బిగ్ బాస్ 11వ సీజన్ ప్రసారాన్ని శాశ్వతంగా ఆపేయాలంటూ సాగర్ అనే న్యాయవాది షిమోగా జిల్లాకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో షో మేకర్స్‌కు కోర్టు నుంచి నోటీసులు అందినట్టు సమాచారం. మరి షో మేకర్స్ ఈ పిటిషన్‌ను ఎలా ఎదుర్కొంటారో..! కొన్ని వర్గాల్లో తమ షో మీద వస్తున్న వ్యతిరేకతను ఎలా అధిగమించి షోను కంటిన్యూ చేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.