Rashmika Mandanna: రష్మిక బాయ్‏ ఫ్రెండ్‏గా కన్నడ హీరో.. అతడు నవ్వితే అమ్మాయిలు ఫ్లాట్ అంటున్న నేషనల్ క్రష్..

పుష్ప 2 సినిమాలో నటిస్తోన్న రష్మిక.. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ రాహుల్ రవింద్రన్ దర్శక్తవం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రేమ, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరనేది రివీల్ చేశారు మేకర్స్. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా కనిపించనున్నది కన్నడ యంగ్ హీరో

Rashmika Mandanna: రష్మిక బాయ్‏ ఫ్రెండ్‏గా కన్నడ హీరో.. అతడు నవ్వితే అమ్మాయిలు ఫ్లాట్ అంటున్న నేషనల్ క్రష్..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2023 | 7:18 AM

ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ మూవీ హిట్ తర్వాత వరుస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో నటిస్తోన్న రష్మిక.. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ రాహుల్ రవింద్రన్ దర్శక్తవం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రేమ, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరనేది రివీల్ చేశారు మేకర్స్. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా కనిపించనున్నది కన్నడ యంగ్ హీరో దీక్షత్ శెట్టి. కన్నడలో ‘దియా’ సినిమా ద్వారా పాపులర్ అయ్యాడు దీక్షిత్. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత కన్నడలో పలు చిత్రాల్లో నటించిన దీక్షిత్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కలిసి నటించిన దసరా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో అతడి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇప్పుడు దీక్షిత్ మంచి కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తమిళ, మలయాళ సినిమాలను కూడా దీక్షిత్ అంగీకరించినట్లు సమాచారం.

దీక్షిత్ ప్రస్తుతం రష్మిక మందన్న ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో రష్మిక మందన్నకు ప్రియుడిగా నటిస్తున్నారు. ‘బాయ్‌ఫ్రెండ్’ పరిచయ టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు (డిసెంబర్ 22) విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో రష్మిక మాట్లాడుతూ.. ” నా బాయ్ ఫ్రెండ్ పేరు విక్రమ్. MSc కంప్యూటర్ సైన్స్, విక్కీ మా కాలేజీ టీమ్‌లోని విరాట్ కోహ్లీ, విక్కీ నవ్వితే చాలు అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోతారు. ” అంటూ చెప్పుకొచ్చింది.. టీజర్ చివర్లో, దీక్షిత్ శెట్టి ఒక బార్‌లో ఎవరితోనో పోరాడుతున్నాడు. దీక్షిత్ స్టైలిష్ కానీ కోపంతో కూడిన వ్యక్తిత్వం ఉన్న పాత్రలో కనిపిస్తారు. నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హషీమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.