Salaar Movie: ‘సలార్’ సినిమాలో చూపించిన ఖాన్సార్ నగర్ ఎక్కడుందో తెలుసా ?.. భారతదేశంలోనే ఉందా ?..

చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసిన అడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. కథానాయికగా శ్రుతిహాసన్ మెప్పించింది. ఇక రవి బస్రూర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు నీల్.

Salaar Movie: 'సలార్' సినిమాలో చూపించిన ఖాన్సార్ నగర్ ఎక్కడుందో తెలుసా ?.. భారతదేశంలోనే ఉందా ?..
Salaar Khansar City
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2023 | 8:25 AM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా దుమ్ము రేపుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసిన అడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. కథానాయికగా శ్రుతిహాసన్ మెప్పించింది. ఇక రవి బస్రూర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు నీల్. ఈ సినిమాకు కేజీఎఫ్ చిత్రానికి ఏలాంటి సంబంధం లేదని గతంలోనే వెల్లడించాడు డైరెక్టర్. అయితే నీల్ సినిమాల్లో ఎప్పుడూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు సలార్ సినిమాలోనూ అదే జరిగింది. ఈ సినిమా కథ అంతా ఖన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది.

ఈ నగరం నిజంగానే భారతదేశంలో ఉందా ? సినిమా కోసం క్రియేట్ చేశారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అడియన్స్. అయితే సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు. దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా ? అనే అనుమానాలు వచ్చాయి. నిజానికి ఖన్సార్ అనే నగరం ఉంది. కానీ సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్, గుజరాజ్ మధ్య కాదు.. ఇరాన్ లో ఉంది ఈ ఖాన్సార్ కౌంటీ అనే నగరం. ఇరాన్ లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడ 22 వేలకు పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సార్ నగరానికి.. ఇరాన్ లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుండడంతో ఖాన్సార్ సిటీ గురించి తెరపకైకి వచ్చింది.

ప్రస్తుతం సలార్ ఫస్ట్ ఫార్ట్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఇన్నాళ్లు సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. కానీ ఇప్పుడు నీల్, ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ హిట్ కావడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..