Ala Ninnu Cheri: ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ కొత్త సినిమా.. ‘అలా నిన్ను చేరి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తాజాగా డిజిటల్ ప్లాట్ ఫాంపైకి మరో మూవీ వచ్చేసింది. టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్, యంగ్ హీరో దినేశ్ తేన్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ సినిమా 'అలా నిన్ను చేరి'. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లలలో విడుదలైంది. ఈ సినిమాకు మరేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలోకి అలా వచ్చి వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Ala Ninnu Cheri: ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ కొత్త సినిమా.. 'అలా నిన్ను చేరి' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Ala Ninnu Cheri Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2023 | 9:07 AM

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల హవా నడుస్తోంది. మొన్నటి వరకు యానిమల్ సినిమా సంచనలం సృష్టించగా.. ఇప్పుడు సలార్, డంకీ చిత్రాలు దుమ్ము రేపుతున్నాయి. అయితే ఓవైపు పెద్ద ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేస్తుండగా.. ఓటీటీలోనూ చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. తాజాగా డిజిటల్ ప్లాట్ ఫాంపైకి మరో మూవీ వచ్చేసింది. టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్, యంగ్ హీరో దినేశ్ తేన్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ సినిమా ‘అలా నిన్ను చేరి’. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లలలో విడుదలైంది. ఈ సినిమాకు మరేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలోకి అలా వచ్చి వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాను నిర్మించగా.. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. ఈసినిమాలో కేదార్ శంకర్, అనశ్వి రెడ్డి, శివ కుమార్, చమక్మక్ చంద్ర, ఝాన్సీ, మహేశ్ ఆచంట కీలకపాత్రలు పోషించారు.

కథ విషయానికి వస్తే..

ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయ దివ్య (పాయల్).. సాధారణ కుటుంబానికి చెందిన గణేశ్ (దినేశ్ తేజ్) ప్రేమలో పడుతుంది. కానీ దివ్యకు వేరే వ్యక్తితో పెళ్లి నిర్ణయిస్తుంది ఆమె తల్లి. దీంతో తనను ఎక్కిడకైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని గణేశ్ పై ఒత్తిడి తీసుకువస్తుంది. సినీ డైరెక్టర్ కావాలని ఎన్నో కళలు కంటున్న గణేశ్..దివ్యతో పెళ్లి గురించి ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలోనే అను (హెబ్బా పటేల్) అతడికి పరిచయం అవుతుంది. అను రాకతో గణేశ్, దివ్య ప్రేమకథలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అనేది సినిమా. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Hebah P (@ihebahp)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.